Samsung Galaxy A35 5G : శాంసంగ్ గెలాక్సీ A35 5Gపై కిర్రాక్ డిస్కౌంట్లు.. తక్కువ ధరకే వస్తుంటే కొనకుండా ఉండలేరు!
Samsung Galaxy A35 5G : శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ ధర తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

Samsung Galaxy A35 5G
Samsung Galaxy A35 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? అతి చౌకైన ధరకే శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ (Samsung Galaxy A35 5G) కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ ధర రూ. 20వేలు లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్‌పై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ కు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ A35 5G ధర తగ్గింపు :
ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. శాంసంగ్ ఫోన్‌లోని 8GB, 128GB వేరియంట్ ధర రూ. 33999గా లిస్టు అయింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ నుంచి 41శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత శాంసంగ్ 5G ఫోన్ రూ. 19,999కి ధరకే వస్తుంది.
బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై రూ. వెయ్యి తగ్గింపు అందిస్తోంది. రూ. 19,250 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ బాగుంటే నెలకు రూ. 3334 ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A35 (Samsung Galaxy A35 5G) డిస్‌ప్లే 6.6-అంగుళాల అమోల్డ్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. అదే సమయంలో ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో వస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పొందవచ్చు.
Read Also : Vivo T3 Ultra 5G : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే వివో T3 అల్ట్రా ఫోన్.. సూపర్ డీల్..!
కెమెరా, బ్యాటరీ ఫీచర్లు :
కెమెరా, వీడియో క్వాలిటీ కోసం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 8MP, థర్డ్ కెమెరా 5MP, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా కూడా ఉంది. పవర్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.