Samsung Galaxy A55 5G
Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ (Samsung Galaxy A55 5G) అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 12వేలు ధర తగ్గింపు అందిస్తోంది.
Read Also : Jio Offer : జియో అదిరే ప్లాన్.. రూ. 100తో 90 రోజుల వ్యాలిడిటీ, 5GB హైస్పీడ్ డేటా, మరెన్నో OTT బెనిఫిట్స్..!
కెమెరా సిస్టమ్, మిడ్ రేంజ్ ఆప్షన్ కలిగిన శాంసంగ్ ఫోన్ ప్రస్తుతం రూ. 28వేల కన్నా తక్కువ ధరకు అమ్ముడవుతోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, అమోల్డ్ డిస్‌ప్లే, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
గత ఏడాది మార్చిలో శాంసంగ్ గెలాక్సీ A55 బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 39,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ గెలాక్సీ A55 డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మీరు ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 ధర :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 కేవలం ధర రూ.27,999కే లభిస్తుంది. లాంచ్ ధరపై రూ.12వేలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది.
అదనంగా, మీ పాత ఫోన్ రూ.26,450 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో ట్రేడ్-ఇన్ చేయొచ్చు. శాంసంగ్ ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A55 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 6.60-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే (2340×1080) పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
25W ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP కెమెరా, 5MP కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సింగిల్ 32MP సెన్సార్ కూడా ఉంది.