Jio Cheapest Plan : జియో చౌకైన ప్లాన్.. రూ. 195కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ జియోహాట్‌స్టార్, హైస్పీడ్ డేటా పొందొచ్చు!

Jio Cheapest Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో తక్కువ ధరకే జియో రూ. 195 ప్లాన్ అందిస్తోంది. 90 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీ జియోహాట్‌స్టార్ పొందొచ్చు.

Jio Cheapest Plan : జియో చౌకైన ప్లాన్.. రూ. 195కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ జియోహాట్‌స్టార్, హైస్పీడ్ డేటా పొందొచ్చు!

Reliance Jio

Updated On : May 17, 2025 / 3:19 PM IST

Jio Cheapest Plan : జియో చౌకైన్ ప్లాన్.. మీరు జియో యూజర్ అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ మీకోసమే.. ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కేవలం రూ. 100 రూపాయలకే అద్భుతమైన ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు OTT సర్వీసులకు సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

Read Also : Google Chrome : క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. హైరిస్క్‌లో మీ డేటా.. ఇప్పుడే బ్రౌజర్ అప్‌‌డేట్ చేసుకోండి..!

జియో రూ.100 రీఛార్జ్ ప్లాన్ :
రిలయన్స్ జియో రూ.100 ప్లాన్ విషయానికి వస్తే.. డేటా-ఓన్లీ ప్లాన్. 90 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 5GB డేటాను అందిస్తోంది.

రీఛార్జ్ చేసుకుంటే.. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. మొబైల్ లేదా టాబ్లెట్ కాకుండా టీవీలు లేదా ల్యాప్‌టాప్‌లు వంటి బిగ్ డిస్‌ప్లేలు ఉన్న ఫోన్లలో కూడా (JioHotstar)ను 90 రోజుల పాటు యాక్సస్ చేయొచ్చు.

అనేక ఇతర ప్లాన్‌లు, జియోహాట్‌స్టార్‌కు మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లను మాత్రమే అందిస్తున్నాయి. ప్రస్తుత ప్లాన్‌లో అదనపు డేటా కోసం డేటా-ఓన్లీ ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లలో కాల్ చేయడం లేదా SMS చేయడం వంటి బెనిఫిట్స్ ఉండవు. ప్రత్యేకించి డేటాను కూడా పొందవచ్చు.

Read Also : Jio Offer : జియో అదిరే ప్లాన్.. రూ. 100తో 90 రోజుల వ్యాలిడిటీ, 5GB హైస్పీడ్ డేటా, మరెన్నో OTT బెనిఫిట్స్..!

జియో రూ. 195 డేటా ఓన్లీ ప్యాక్ :
అధిక డేటా, వ్యాలిడిటీతో రూ. 195 ప్లాన్‌ ఎంచుకోవచ్చు. అదనంగా 15GB డేటాను అందిస్తోంది. డేటా-ఓన్లీ ప్లాన్ రీఛార్జ్ ద్వారా ఇంటర్నెట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.