Google Chrome : క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. హైరిస్క్‌లో మీ డేటా.. ఇప్పుడే బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోండి..!
Google Chrome : గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు బిగ్ అలర్ట్.. విండోస్, మ్యాక్, లైనక్స్‌లోని భద్రతా లోపాలను వెంటనే ఫిక్స్ చేయాలి.

Google Chrome Users
Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. విండోస్, మాక్, లైనక్స్‌లోని గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హై-రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఎందుకంటే.. హ్యాకర్లు ప్రభావిత డివైజ్‌లను నియంత్రించేందుకు అనుమతించే తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయి.
సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In జారీ చేసిన హెచ్చరిక ప్రకారం.. సేఫ్‌గా ఉండటానికి యూజర్లందరూ తమ బ్రౌజర్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.
సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విండోస్, మ్యాక్ డివైజ్‌ల్లో 136.0.7103.113/.114, లైనెక్స్ కోసం 136.0.7103.113 కన్నా ముందు ఉన్న క్రోమ్ వెర్షన్‌లలో అనేక లోపాలు బయటపడ్డాయి.
ఈ లోపాలు సైబర్ నేరస్థులు సున్నితమైన డేటాను దొంగిలించడం లేదా హానికరమైన వెబ్‌సైట్ విజిట్ చేసేలా ప్రేరేపిస్తుంది. మీ సిస్టమ్‌ను క్రాష్ చేసేందుు కూడా అనుమతించవచ్చు.
గూగుల్ క్రోమ్‌లో మల్టీపుల్ బగ్స్ ఉన్నట్టు గుర్తించారు. రిమోట్ అటాక్ చేసేవారు అర్బిటరీ కోడ్‌ను రన్ చేసేందుకు అనుమతిస్తుంది” అని CERT-In పేర్కొంది.
ఎవరికి రిస్క్ ఉందంటే? :
డెస్క్‌టాప్ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ వాడే వ్యక్తులు, సంస్థలు రిస్క్‌లో ఉన్నాయి. భద్రతా లోపాలను పరిష్కరించకపోతే, దాడి చేసేవారు మీ డేటాను దొంగిలించవచ్చు. వినియోగదారులు వీలైనంత త్వరగా తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అడ్వైజరీ సూచిస్తోంది.
యూజర్లు ఏం చేయాలి? :
భారత్‌లో ఎక్కువ మంది వినియోగించే బ్రౌజర్‌లలో క్రోమ్ ఒకటి. విండోస్, macOS లేదా Linux అయినా ఈ వార్నింగ్ అన్ని డెస్క్‌టాప్ యూజర్లను ప్రభావితం చేస్తుంది.
ఇప్పటికే హ్యాకర్లు (CVE-2025-4664) బగ్ వినియోగిస్తున్నారని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వినియోగదారులు తమ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
విండోస్ లేదా మాక్ (డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్)లో క్రోమ్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి? :
Windows లేదా Mac డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేసేందుకు ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి విండో టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న 3 వర్టికల్ డాట్స్‌పై క్లిక్ చేయండి.
డ్రాప్‌డౌన్ మెను నుంచి ‘Help’ వెళ్లి ‘About Google Chrome’ ఎంచుకోండి. క్రోమ్ ఆటోమాటిక్‌గా అప్‌డేట్స్ కోసం చెక్ చేస్తుంది. ఏవైనా కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంటే ఇన్‌స్టాల్ చేస్తుంది. అప్‌డేట్ పూర్తయిన తర్వాత ఓసారి బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయండి.