Samsung Galaxy S23 5G : ఆఫర్ అదిరింది భయ్యా.. అతి తక్కువ ధరకే శాంసంగ్ 5G కొనేసుకోండి.. 50MP ట్రిపుల్ కెమెరాలే హైలెట్..!
Samsung Galaxy S23 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ సేల్‌తో శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫోన్ తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

Samsung Galaxy S23 5G
Samsung Galaxy S23 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫోన్ ధర తగ్గింది.
అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరా, డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఇదే బెస్ట్ టైమ్. శాంసంగ్ గెలాక్సీ S23 5G తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్‌లు శాంసంగ్ మొబైల్ ఫోన్ కొనుగోలుపై మరింత ఆదా చేసుకోవచ్చు.
సాధారణంగా స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫోన్ రూ. 69,999 ధరకు లభిస్తుంది. 256GB వేరియంట్ ఇప్పుడు రూ. 53,500 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
ఈ శాంసంగ్ ఫోన్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు, ట్రిపుల్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్, ప్రీమియం డిజైన్ ఉన్నాయి. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 5G తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 5G ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫోన్ ధర రూ.54,999కి లిస్టు అయింది. ఈ సేల్ కారణంగా రూ.15వేలు తగ్గింది. కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌లను కూడా వినియోగించుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో రూ.1,649 తగ్గింపును పొందవచ్చు.
మొత్తం ధర రూ.53,500 కన్నా తక్కువగా ఉంటుంది. కస్టమర్లు నెలకు రూ.2,666 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐలతో సహా వివిధ ఈఎంఐ ఆప్షన్ల నుంచి కూడా ఎంచుకోవచ్చు. మీరు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
వర్కింగ్ కండిషన్లు, మోడల్, బ్రాండ్ ఆధారంగా రూ. 52,100 వరకు పొందవచ్చు. కొనుగోలుదారులు ఎక్కువ చెల్లించడం ద్వారా శాంసంగ్ కేర్ ప్లస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23 5G స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల అమోల్డ్‌తో వస్తుంది. 8GB వరకు LPDDR5 ర్యామ్, 512GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 నుంచి పవర్ పొందుతుంది. 25W ఛార్జింగ్‌తో 3,900mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
గెలాక్సీ ఏఐ ఫీచర్‌లకు సపోర్టు ఇచ్చే వన్ యూఐ 7 అప్‌డేట్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ శాంసంగ్ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.