Samsung Galaxy S23 Plus 5G
Samsung Galaxy S23 Plus 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అత్యంత సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ (Samsung Galaxy S23 Plus 5G) 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో 512GB మోడల్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుత ధర కన్నా చాలా తక్కువే.
ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా సిస్టమ్‌తో పాటు పవర్‌ఫుల్ చిప్‌సెట్, ఆకర్షణీయమైన డిస్‌ప్లే ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా, రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ 5Gపై భారీ తగ్గింపు :
ఈ శాంసంగ్ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.1,28,999గా ఉంది. 512GB శాంసంగ్ ఫోన్ సగం ధరకే కొనేసుకోవచ్చు. కొనుగోలుదారులు 49 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ రూ.65,999 మాత్రమే.
శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ 5G కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అమెజాన్ నుంచి ఈ ఫోన్‌ను రూ.62,150 ధరకే ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ 5G ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ ఫ్రేమ్ మెటల్‌తో వస్తుంది. IP68 రేటింగ్ పొందింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల డైనమిక్ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అందిస్తుంది.
512GB భారీ స్టోరేజీ, 8GB ర్యామ్ ఉన్నాయి. 50+10+12MP ట్రిపుల్ కెమెరా కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 12MP కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 4700mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.