New Toll Policy : వాహనదారులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్.. ఒకసారి చెల్లిస్తే.. అన్‌లిమిటెడ్ ఫ్రీ జర్నీ..!

New Toll Policy : వాహనదారులు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడాదికి రూ. 3వేలు ఒకేసారి చెల్లింపుతో అన్‌లిమిటెడ్ ఫ్రీ జర్నీ చేయొచ్చు.

New Toll Policy : వాహనదారులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్.. ఒకసారి చెల్లిస్తే.. అన్‌లిమిటెడ్ ఫ్రీ జర్నీ..!

New Toll Policy

Updated On : May 25, 2025 / 7:41 PM IST

New Toll Policy : వాహనదారులకు గుడ్ న్యూస్.. హైవేలపై ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్,  (New Toll Policy) ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు.. కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ పాలసీని ప్రవేశపెట్టబోతుంది.

తద్వారా హైవే ప్రయాణం మరింత సులభతరం కానుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. వాహన యజమానులు త్వరలో ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్‌ ఎంచుకోవచ్చు.

Read Also : OnePlus 13 Price : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 10వేలు తగ్గింపుతో వన్‌ప్లస్ 13 కొనేసుకోండి..!

ఈ వార్షిక పాస్ కోసం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఏడాది మొత్తం ఫ్రీగా వాహనాల్లో తిరగొచ్చు.

కొత్త టోలసీ పాలసీకి సంబంధించి సింగిల్ పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడాదికి రూ. 3వేలు ఒకేసారి చెల్లింపుతో అన్‌లిమిటెడ్ జర్నీ చేయొచ్చు.

నివేదికల ప్రకారం.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కొత్త టోల్ విధానం కింద రెండు రకాల పేమెంట్ సిస్టమ్ పరిశీలిస్తోంది. ప్రతిపాదిత టోల్ విధానం ప్రకారం.. వినియోగదారులకు వార్షిక పాస్, దూరం ఆధారిత ధర ఆప్షన్ అందించనుంది.

ఈ కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. వాహనదారులు ప్రతిసారీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. జాతీయ రహదారులపై వాహనాలకు ఇబ్బందిలేకుండా ప్రయాణించవచ్చు.

వార్షిక పాస్ :
రూ. 3వేలతో ఒకేసారి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఏడాదంతా టోల్ ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు.

దూర ఆధారిత టోల్ : వార్షిక పాస్ లేని వాహనదారులు కిలోమీటర్ ఆధారంగా టోల్ చెల్లించాలి. 100 కి.మీకు రూ. 50 ఫ్లాట్ టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

వార్షిక పాస్ తీసుకున్న వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్‌ను ఒకేసారి వార్షిక రుసుము రూ. 3వేలతో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ వార్షిక పాస్ ఎంచుకోవడానికి ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు లేదా ఇన్‌స్టాలేషన్స్ అవసరం లేదు. ఇప్పటికే ఉన్న FASTag అకౌంట్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.

గతంలో 15 ఏళ్ల పాటు రూ.30వేలు అందించే లైఫ్ టైమ్ ఫాస్ట్‌ట్యాగ్ ఆలోచనను కూడా ప్రభుత్వం విరమించుకుంది. ప్రస్తుత టోల్ ప్లాజా ప్రకారం.. 100 కి.మీ.కు రూ. 50 ఫ్లాట్ రేట్‌ను ఎంచుకోవచ్చు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ న్యూస్.. ఈ నెల 31లోగా ఇలా చేయండి.. లేదంటే రూ. 2వేలు పడవు.. ఫుల్ డిటెయిల్స్..!

ఈ కొత్త పాలసీ ద్వారా టోల్ ప్లాజాల అవసరం ఉండదు. సెన్సార్ ఆధారిత డిజిటల్ టోల్ కలెక్షన్‌ అందుబాటులోకి వస్తుంది. టోల్ ఛార్జ్ కోసం GPS, ఆటోమేటెడ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది.

ఇది అమల్లోకి వస్తే.. ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. సాధారణ ప్రయాణికులకు రోడ్డు ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది.