Samsung Galaxy S23 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. అల్ట్రా కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, అద్భుతమైన ఫీచర్లతో కొత్త శాంసంగ్ ఫోన్ కొనేసుకోవచ్చు. శాసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో రూ. 43,999 భారీ తగ్గింపుతో పొందవచ్చు.
2/6
ఈ శాంసంగ్ ఫోన్ గత ఏడాదిలోనే లాంచ్ కాగా ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్, అమోల్డ్ ప్యానెల్, ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ బ్లూటూత్‌తో కూడిన S పెన్‌తో అద్భుతమైన డివైజ్ కూడా అందిస్తుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ధర : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా రూ.42,499 ధర తగ్గింపుతో రూ.77,500 వద్ద లిస్ట్ అయింది. వన్‌కార్డ్, పీఎన్‌బీ మరిన్నింటితో సహా క్రెడిట్ కార్డులపై కస్టమర్లు అదనంగా రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాదు, కస్టమర్లు నెలకు రూ.3,757 నుంచి ఈజీ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. అయితే, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర హైడింగ్ ఛార్జీలను కూడా ఉంటాయి.
4/6
నో-కాస్ట్ ఈఎంఐ అయినప్పటికీ మీ పాత ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని రూ. 58వేల వరకు బెస్ట్ వాల్యూను పొందవచ్చు. కచ్చితమైన వాల్యూ అనేది పూర్తిగా వర్కింగ్ కండిషన్స్, బ్రాండ్, మోడల్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తిగ కొనుగోలుదారులు ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G స్పెషిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అడ్రినో 740 జీపీయూతో వస్తుంది.
6/6
ఈ శాంసంగ్ ఫోన్ కొన్ని ప్రాంతాలలో వన్ యూఐ 8 అప్‌డేట్ అందుకుంది. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. కెమెరా సెటప్ పరంగా.. ఈ ఫోన్ 200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 10MP 3x టెలిఫోటో, 10MP 10x పెరిస్కోప్ లెన్స్ అందిస్తుంది. 12MP సెల్ఫీ కెమెరా కూడా అందిస్తుంది.