Samsung Galaxy S25 FE
Samsung Galaxy S25 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. భారత మార్కెట్లో సౌత్ కొరియన్ దిగ్గజ శాంసంగ్ అధికారికంగా గెలాక్సీ S25 FE ఫోన్ ఈ నెల 15న లాంచ్ అయింది. అయితే, ఈ శాంసంగ్ ఫోన్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ స్ట్రీమ్‌లైన్డ్ వెర్షన్. కేవలం 15 రోజుల తర్వాత సేల్ మొదలైంది.
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ లేటెస్ట్ వన్ యూఐ 8 ఆపరేటింగ్ (Samsung Galaxy S25 FE) సిస్టమ్ ద్వారా పవర్ అందిస్తుంది. కొత్త గెలాక్సీ ఏఐ సూట్‌ను కలిగి ఉంది. హార్డ్‌వేర్‌లో 4,900mAh బ్యాటరీ, కూలింగ్ కోసం అప్‌గ్రేడ్ వేపర్ చాంబర్, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 FE సేల్ ఆఫర్లు ఎలా పొందాలంటే?
శాంసంగ్ గెలాక్సీ S25 FE భారత్ ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999కు లభిస్తుంది. హై-టైర్ వేరియంట్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
శాంసంగ్ అనేక ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను అందిస్తోంది.
క్యాష్‌బ్యాక్ : డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లకు ఇన్‌స్టంట్ రూ. 5వేలు క్యాష్‌బ్యాక్
ఈఎంఐ : కస్టమర్లు 24 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్
బండిల్ ఆఫర్ : శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE కొనుగోలుపై రూ. 4వేలు తగ్గింపు
స్క్రీన్ ప్రొటెక్షన్ : రెండేళ్ల స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ అదనంగా రూ.4,199 చెల్లించాలి.
లిమిటెడ్-టైమ్ అప్‌గ్రేడ్ : లిమిటెడ్ టైమ్ డీల్ ప్రకారం.. కంపెనీ కస్టమర్‌లు స్టోరేజ్‌ను 256GB నుంచి 512GBకి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఈ ఫోన్ నేవీ, జెట్‌బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ప్రత్యేక స్టోర్లు, అధీకృత ఆఫ్‌లైన్ రిటైలర్లు, ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X
రిఫ్రెష్ రేట్ : 120Hz
ప్రాసెసర్ : ఎక్సినోస్ 2400
ర్యామ్, స్టోరేజీ : 8GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టమ్ : వన్ UI 8
సాఫ్ట్‌వేర్ మద్దతు : 7 సంవత్సరాల Android OS మరియు భద్రతా నవీకరణలు
వెనుక కెమెరా సెటప్ : ట్రిపుల్-కెమెరా 50MP వైడ్ + 12MP అల్ట్రావైడ్ + 8MP టెలిఫోటో
ఫ్రంట్ కెమెరా : 12MP
బ్యాటరీ : 4,900mAh
వైర్డు ఛార్జింగ్ : 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఫ్రేమ్ మెటీరియల్ : ఆర్మర్ అల్యూమినియం