Samsung Galaxy S25
Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? పండగ సీజన్‌లో అమెజాన్ అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు లుక్స్, పెర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ లైఫ్ అందించే కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. శాంసంగ్ గెలాక్సీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25 ప్రస్తుతం రూ. 19వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
కానీ, శాంసంగ్ గెలాక్సీ S25 5G ధర విషయానికి వస్తే.. రూ. 80,999కి లాంచ్ (Samsung Galaxy S25) అయింది. ట్రిపుల్ కెమెరా, అమోల్డ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 లాంచ్ ధర కన్నా రూ.18,104 తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ శాంసంగ్ ఫోన్ రూ.62,895 ధరకు లిస్ట్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
దాంతో శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ.61,895కి తగ్గుతుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు రూ.3,049 నుంచి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల విషయానికి వస్తే.. పాత ఫోన్ ట్రేడింగ్ ద్వారా రూ. 47వేల వరకు వాల్యూను పొందవచ్చు. కానీ, వాస్తవ విలువ మీ డివైజ్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. అమెజాన్ అదనపు ఖర్చుతో ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ మరిన్ని యాడ్-ఆన్ ఫీచర్లను కూడా అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు :
కంటెంట్ స్ట్రీమింగ్, గేమింగ్ కోసం 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో కాంపాక్ట్ 6.2-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 4,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
ఈ శాంసంగ్ ఆండ్రాయిడ్ 16-ఆధారిత వన్ యూఐ 8 అప్‌డేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. దాంతో OISతో కూడిన 50MP బ్యాక్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.