శాంసంగ్ ఇండియా కొత్త కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకోస్తోంది. ఇండియాలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే తమ కస్టమర్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ కొనలేని కస్టమర్లకు స్వయంగా లోన్లు ఇచ్చేందుకు కంపెనీ ప్లాన్ రెడీ చేస్తోంది.
డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా DMI ఫైనాన్స్ భాగస్వామ్యంతో కస్టమర్లకు శాంసంగ్ ఫైనాన్స్ + లోన్ ఆఫర్ చేస్తోంది. రిపోర్టుల ప్రకారం.. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు శాంసంగ్ ఈ లోన్ ఆఫర్ అందిస్తోంది.
జీరో వడ్డీకే.. స్మార్ట్ ఫోన్ :
దేశంలో తమ వినియోగదారులను పెంచుకునేందుకు సౌత్ కొరియన్ దిగ్గజం ఈ కొత్త లోన్ ఆఫర్ తో ముందుకొస్తోంది. బ్రిక్, మోర్టార్ రిటైలర్లుతో పాటు భారీ ఫార్మాట్ రిటైల్ స్టోర్లలో ఫైనాన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని రిపోర్టు తెలిపింది. నెలవారీ చెల్లింపులపై జీరో వడ్డీతో స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా శాంసంగ్ ఫైనాన్స్ + ఆఫర్ 30 నగరాల్లో 5వేల స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. 2019 ఏడాదికి 100 నగరాల్లో 10వేలకు పైగా స్టోర్లను విస్తరించేందుకు శాంసంగ్ ప్రణాళిలు సిద్ధం చేస్తోంది. లోన్ కావాల్సిన కస్టమర్లు ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
* శాంసంగ్ ఫైనాన్స్ + అప్లికేషన్ ఔట్ లెట్ ఇన్ స్టోర్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది.
* ఇందులో కస్టమర్లు తమ వివరాలను ఎంటర్ చేయాలి.
* కేవైసీ వెరిఫికేషన్ ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది.
* దీని ఆధారంగా కస్టమర్లకు ఎంత లోన్ ఇవ్వాలో నిర్ణయిస్తారు.
* 25 నిమిషాల్లో లోన్ అప్రూవ్ అవుతుంది.