Savings Scheme : పెట్టుబడిదారులకు పండగే.. ఈ బ్యాంకులో రూ. 2 లక్షలు FD చేస్తే చాలు.. ఏకంగా రూ. 30,908 వడ్డీ పొందొచ్చు.. ఎలాగంటే?

Savings Scheme : మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 7 రోజులు, గరిష్టంగా 10 ఏళ్ల కాలానికి FD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

Savings Scheme

Savings Scheme : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఏదైనా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఈ ఏడాదిలో (Savings Scheme) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 1.00 శాతం తగ్గించింది. గత ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే.

కానీ, ఆగస్టులో రెపో రేటును 5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయించారు. ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించిన తర్వాత అన్ని బ్యాంకులు కూడా ఎఫ్‌డి వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. అయినప్పటికీ, యూనియన్ బ్యాంక్ ఇప్పటికీ ఎఫ్‌డిపై అద్భుతమైన వడ్డీని అందిస్తోంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.35 శాతం వడ్డీని అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు కనీసం 7 రోజులు, గరిష్టంగా 10 ఏళ్ల కాలానికి FD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ బ్యాంకు FDపై 3.40 శాతం నుంచి 7.35 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఇలాంటి FD స్కీమ్ అందిస్తోంది. మీరు ఇందులో కేవలం రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా రూ. 30,908 వరకు స్థిర వడ్డీని పొందవచ్చు.

Read Also : Top 5 Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. పిక్సెల్ 10 ప్రో XL కన్నా అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లలో అంతకుమించి..!

ఎవరికి ఎంత వడ్డీ అంటే? :

ఈ ప్రభుత్వ బ్యాంకు 2 ఏళ్ల FDపై 6.50 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాలపరిమితి గల FD పథకాలపై సాధారణ పౌరులకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాధారణ పౌరులు 6.50 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లు 7.00 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లు 7.25 శాతం వడ్డీని పొందవచ్చు.

మెచ్యూరిటీపై ఎంతంటే? :
మీరు రూ. 2లక్షల డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీపై రూ. 30,908 స్థిర వడ్డీ పొందవచ్చు. సాధారణ పౌరులకు యూనియన్ బ్యాంక్‌లో 2 ఏళ్ల FDలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 2,27,528 లభిస్తుంది. రూ. 27,528 స్థిర వడ్డీ పొందవచ్చు.

మీరు సీనియర్ సిటిజన్ అయితే యూనియన్ బ్యాంక్‌లో 2 ఏళ్ల FDలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 2,29,776 లభిస్తుంది. తద్వారా రూ. 29,776 స్థిర వడ్డీ లభిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 2 ఏళ్లలో FDలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 2,30,908 లభిస్తుంది. ఇందులో రూ. 30,908 స్థిర వడ్డీని సంపాదించుకోవచ్చు.