SBI Card New Rules
SBI Card New Rules : ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.. వచ్చే ఆగస్టు నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ కార్డు నిబంధనల్లో అతి పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు అనేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఉన్న అనేక బెనిఫిట్స్ ఎత్తేస్తోంది. ముఖ్యంగా ఫ్రీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్పు ఆగస్టు 11, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
ఇప్పటివరకు, UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, PSB, కరూర్ వైశ్య బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైన వాటితో కలిసి జారీ చేసిన కొన్ని ELITE, PRIME కార్డులపై రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల విమాన ప్రమాద కవర్ అందిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ బెనిఫిట్ నిలిపివేయనుంది. ఈ కింది ఎస్బీఐ క్రెడిట్ కార్డులలో ఏయే టైప్ కార్డులపై రూ. కోటి ఇన్సూరెన్స్ కవరేజీ నిలిపివేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఏ క్రెడిట్ కార్డులపై రూ. 1 కోటి కవర్ నిలిపివేస్తుందంటే? :
బిల్లింగ్ సిస్టమ్‌లో మార్పులు :
ఎస్బీఐ కార్డ్ అనేది 15 జూలై 2025 నుంచి బిల్లింగ్, పేమెంట్ ప్రక్రియలో కూడా మార్పులు చేసింది. ఇప్పుడు పూర్తిగా GST, EMI, ఫీజులు, ఫైనాన్స్ ఛార్జీలు, ఓవర్‌లిమిట్ మొత్తం మిగిలిన బిల్లులో 2శాతం మినిమం అమౌంట్ డ్యూలో యాడ్ అవుతాయి.
పేమెంట్ అడ్జెస్ట్‌మెంట్ :
ఇప్పుడు కస్టమర్ చేసిన పేమెంట్ మొదట GST, ఆ తరువాత EMI ఆపై ఫీజులు, ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, రిటైల్ ఖర్చులు చివరకు క్యాష్ అడ్వాన్స్‌కు అడ్జెస్ట్ అవుతుంది. పైన పేర్కొన్న క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు ఆగస్టు 11 లోపు కొత్త నిబంధనలను చదివి అవసరమైతేనే ఆప్షన్ ఎంచుకోవాలి.