Bank FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? FDలపై అత్యధిక వడ్డీ అందించే ప్రభుత్వ బ్యాంకులివే.. వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Bank FD Rates : చాలా ప్రభుత్వ బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు అందిస్తున్నాయి.

Bank FD Rates
Bank FD Rates : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నారా? ఏ బ్యాంకులో FD ఉంటే అధిక రాబడి వస్తుందో తెలుసా? ప్రస్తుత రోజుల్లో (Bank FD Rates) ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లపై పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడి కోసం చాలా మంది బ్యాంక్ FDలో పెట్టుబడి పెడుతున్నారు.
FDలో డబ్బుకు స్థిర రాబడి, భద్రత ఉండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఏదిఏమైనా మీరు కూడా FD పెట్టుబడిదారులైతే.. మీకు FDలో అధిక వడ్డీ రేటును అందించే ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఏయే బ్యాంకుల్లో FD పెడితే అధిక వడ్డీ వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు గరిష్టంగా 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఇండియన్ బ్యాంక్ :
ఇండియన్ బ్యాంక్ తమ కస్టమర్లకు అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఈ బ్యాంక్ ఒక ఏడాది FD వడ్డీ రేటు 6.10 శాతంగా ఉంది. బ్యాంక్ FD గరిష్ట వడ్డీ రేటు 6.90 శాతంగా అందిస్తోంది.
కెనరా బ్యాంకు :
ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు అన్ని కాలపరిమితిల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) :
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులలో ఒకటైన PNB తమ కస్టమర్లకు 6.40 నుంచి 6.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI తమ కస్టమర్లకు 6.25 నుంచి 6.60 శాతం వడ్డీ రేటుతో రాబడిని అందిస్తుంది.