SBI ATM New Rules : బిగ్ షాకింగ్ న్యూస్.. ATM నుంచి పదేపదే క్యాష్ తీస్తున్నారా? మీ జేబు ఖాళీ.. SBI కొత్త రూల్స్ ఇవే!
SBI ATM New Rules : మీకు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉందా? అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింది. డబ్బు విత్‌డ్రా చేసే ముందు కొత్త ఛార్జీలేంటో చెక్ చేసుకోండి.
- Sreehari A
- Updated on- September 4, 2026 / 12:36 PM IST
SBI ATM New Rules
- SBI శాలరీ ఖాతాదారులకు ఏటీఎం నిబంధనల్లో మార్పు
- ఉచిత లావాదేవీల సంఖ్యను 10 నుంచి 5కి తగ్గింపు
- కొత్త ఛార్జీలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి
SBI ATM New Rules : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. అందులోనూ శాలరీ ఖాతాదారులు జర జాగ్రత్త.. ఏటీఎంలో డబ్బులు ఎడాపెడా తీశారంటే ఖతమే.. ఛార్జీల మోత తప్పదు.. వచ్చే అక్టోబర్ 1,2026 నుంచి కొత్త ఏటీఎం రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రభుత్వ రంగం బ్యాంకు ఎస్బీఐ తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది.
ఇప్పటివరకూ ఉన్న ఏటీఎం ఉచిత లావాదేవీల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. మీ జీతం డబ్బులు పడగానే ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేద్దామనుకుంటే ముందు ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి.. లేదంటే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం..
ఇక 10 కాదు.. 5 మాత్రమే :
ఎస్బీఐ ఖాతాలో జీతం పడే కస్టమర్లు ఇప్పటివరకూ ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో డబ్బులు తీసేందుకు ప్రతినెలా 10 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉండేది. కానీ, అక్టోబర్ నెల నుంచి ఉచిత లావాదేవీలు 5కు తగ్గించింది ఎస్బీఐ.
ఇంతకీ 5 ఉచిత లావాదేవీల లిమిట్ అనేది క్యాష్ విత్ డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్ మెంట్ వంటి క్యాష్ లెస్ పేమెంట్లు అన్నింటికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఒకవేళ మీరు మెట్రో లేదా నాన్ మెట్రో నగరాల్లో ఉన్నా ఎక్కడా ఉన్నా సరే అందరి శాలరీ ఖాతాదారులకు ఒకే రూల్ వర్తించనుంది.
Read Also : Samsung Galaxy A36 Price : ఏంది మావా ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో డీల్ మిస్ కావొద్దు..!
సాధారణంగా ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకు ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలకు మాత్రమే పరిమితి ఉంది. అది దాటితే మాత్రం అదనపు ప్రతి లావాదేవీపై ఛార్జీలు చెల్లించాల్సిందే.. మీరు ఏటీఎంలో క్యాష్ తీసుకున్నారంటే అదనపు లావాదేవీపై రూ. 23 ఛార్జీ పడుతుంది. ఇంకా దీనికి అదనంగా జీఎస్టీ కూడా పడుతుంది.
ఈ లావాదేవీలపై భారీ ఛార్జీలు :
మీరు ఏటీఎంలో క్యాష్ తీయకుండా కేవలం బ్యాలెన్స్ చెక్ చేయడం లేదా మినీ స్టేట్ మెంట్ తీసుకోవడం చేశారంటే అప్పుడు కూడా అదనంగా ప్రతి లావాదేవీపై రూ.11 ఛార్జ్ పడుతుంది. దీనికి కూడా జీఎస్టీ కట్టాల్సిందే.. అందుకే ఎస్బీఐ బ్యాంకు మినహా ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో శాలరీ ఖాతాదారులు క్యాష్ తీయాలని చూస్తే 5 లావాదేవీల లిమిట్ దాటారో లేదో చెక్ చేసుకోవడం బెటర్.
అదే మీరు ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు తీయాలనుకుంటే ఎలాంటి లిమిట్ లేదు. ఎన్నిసార్లు అయినా డబ్బులు తీసుకోవచ్చు. పైసా ఛార్జీ కూడా పడదు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎస్బీఐ ఏటీఎంల్లో పరిమితికి మించి లావాదేవీలు చేయొచ్చని అంతా ఉచితమేనని బ్యాంకు తెలిపింది.
ఇతర సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తుందా? :
మీకు ఎస్‌బీఐ బ్యాంకులో శాలరీ అకౌంట్ లేనట్లయితే.. అంటే మీకు జనరల్ సేవింగ్ అకౌంట్ లేదా ఇతర టైప్ అకౌంట్ ఉన్నట్లయితే ఈ కొత్త నిబంధనలు వర్తించవు. ఈ ఖాతాదారులు ఎప్పటిలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో 5 ఉచిత లావాదేవీలను కొనసాగించవచ్చు.
