Samsung Galaxy A36 Price : ఏంది మావా ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో డీల్ మిస్ కావొద్దు..!
Samsung Galaxy A36 Price : శాంసంగ్ ఫోన్ ధర భారీగా తగ్గింది.. శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫోన్ రూ. 4వేలు డిస్కౌంట్‌తో లభిస్తోంది. అమెజాన్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A36 Price : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి బంపర్ ఆఫర్.. మంచి బ్యాటరీ లైఫ్, అద్భుతమైన కెమెరా సెటప్, అడ్వాన్స్ డిజైన్ అందించే కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 32,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ఈ డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ కార్డు ఆఫర్లతో ఇంకా ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. లిమిటెడ్ టైమ్ ఆఫర్ త్వరలో ముగియనుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో అదిరే డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A36 ప్రారంభ ధర రూ. 32,999 కాగా ఇప్పుడు ధర రూ. 3,100 తగ్గింది. ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 29,899కే అమ్ముడవుతోంది. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 1,500 డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో నెలకు కేవలం రూ. 1,051 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కొనేసుకోవచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్‌తో అప్‌గ్రేడ్ చేసుకుంటే డివైస్ బ్రాండ్ మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 27,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు.

ఈ ఫోన్ కొనాలా? వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ ఫోన్ అడ్రినో 710 జీపీయూతో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (6nm) చిప్సెట్తో వస్తుంది. అంతేకాదు.. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. కంపెనీ 6 జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్గ్రేడ్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే అందిస్తుంది. ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది. బయట వాడితే 1,900 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందుకోగలదు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.

కెమెరా పరంగా పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ఫ్రంట్ సైడ్ 12MP సెన్సార్ కూడా ఉంది. ఇప్పుడు అసలే ఫోన్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర తక్కువలో లభిస్తే అసలు వదులుకోవద్దు..
