SBI Child SIP
SBI Child SIP : మీ పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.. ప్రతిరోజూ ఎక్కువ మంది SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు.
ఎస్ఐపీ ఇప్పుడు పెట్టుబడి (SBI Child SIP) పెట్టేందుకు అద్భుతమైన మార్గం. చిన్న మొత్తంలో నెలవారీగా భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టుకోవచ్చు. సాధారంగా ఎస్ఐపీలో పెట్టుబడికి కనీసం రూ. 500 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పథకానికి గరిష్ట పరిమితి లేదు.
మీరు మీ పిల్లల పేరు మీద SIP కూడా ప్రారంభించవచ్చు. మీ పిల్లలు చిన్న వయస్సులోనే భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును కూడబెట్టుకోవచ్చు. ఉన్నత చదువుల కోసం లేదా మీ కూతురి పెళ్లి కోసం ఇప్పటినుంచే డబ్బులను దాచుకోవచ్చు. ఎస్బీఐ జన్‌నివేష్ ఎస్ఐపీ పథకం ద్వారా మీ పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. అసలు ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎస్బీఐ జన్ నివేష్ (JanNivesh SIP) ఎస్ఐపీ ప్రత్యేకమైన స్కీమ్‌లో ఎవరైనా తమ పిల్లల కోసం నెలకు రూ.250తో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్బీఐ SBI జన్ నివేష్ ఎస్ఐపీలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం ఎస్బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లోకి వెళ్తుంది. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా పెట్టుబడి ద్వారా మీరు కాలక్రమేణా రూ.17 లక్షల వరకు ఫండ్ కూడబెట్టుకోవచ్చు.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కలిసి జన్ నివేష్ ఎస్ఐపీ పథకాన్ని ప్రారంభించాయి. గ్రామీణ, సెమీ-అర్బన్ పట్టణ ప్రాంతాలలో మొదటిసారి పెట్టుబడిదారులు చిన్నమొత్తంలో ఎస్ఐపీ ఆప్షన్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.
పెట్టుబడి ఆప్షన్లు ఇవే :
ఈ SIPలో రోజువారీ, వారంవారీ, నెలవారీ పెట్టుబడి ఆప్షన్లు ఉంటాయి. పెట్టుబడిదారులు ఎస్బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌తో ప్రారంభించవచ్చు. ఈ ఫండ్ ఈక్విటీ డెట్ రెండింటిలోనూ పెట్టుబడి పెడుతుంది. మెరుగైన రాబడితో మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎక్కువ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తాడు.
రూ. 250తో రాబడి ఎలా? :
ఎవరైనా ప్రతి నెలా రూ. 250 పెట్టుబడి పెడితే.. రూ. 17 లక్షల వరకు ఫండ్ కూడబెట్టుకోవచ్చు. ఈ SIP దాదాపు 12 శాతం నుంచి 16శాతం రాబడిని ఇవ్వగలదు. ఒక వ్యక్తి 30 ఏళ్లకు రూ. 250 డిపాజిట్ చేస్తే.. మొత్తం 15శాతం రాబడితో రూ. 17.30 లక్షలు అవుతుంది. అంటే.. ఇక్కడ మీరు రూ.90వేలు మాత్రమే పెట్టుబడి పెడతారు అనమాట. మిగిలినది రాబడిగా సంపాదిస్తారు. పెట్టుబడి 40 ఏళ్లు కొనసాగితే ఫండ్ రూ. 78 లక్షలకు పెరుగుతుంది.
Disclaimer : ఈ పెట్టుబడికి సంబంధించి సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీరు ఈ పథకంలో పెట్టబడి పెట్టాలని భావిస్తే ముందుగా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.