Google Pixel 8a : ఫ్లిప్‌కార్ట్ బిగ్ వింటర్ బొనాంజా సేల్.. గూగుల్ పిక్సెల్ 8a అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే..!

Google Pixel 8a : ఫ్లిప్‌కార్ట్ బిగ్ వింటర్ బొనాంజా సేల్ మొదలైంది. గూగుల్ పిక్సెల్ 8a ఇప్పుడు కేవలం రూ.30వేలకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 8a : ఫ్లిప్‌కార్ట్ బిగ్ వింటర్ బొనాంజా సేల్.. గూగుల్ పిక్సెల్ 8a అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే..!

Google Pixel 8a

Updated On : November 15, 2025 / 6:02 PM IST

Google Pixel 8a : గూగుల్ పిక్సెల్ ఫోన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 8a వెర్షన్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ వింటర్ బొనాంజా సేల్ సందర్భంగా రూ. 30వేల ధరకే పిక్సెల్ 8a ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 128GB స్టోరేజ్ బేస్ మోడల్ లాంచ్ సమయంలో రూ.52,999గా ఉంది. ఇప్పుడు వింటర్ బొనాంజా సేల్ సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రారంభ ధర ఎంతంటే? :
128GB స్టోరేజ్ మోడల్ ధర (Google Pixel 8a) రూ. 52,999 కాగా, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999కు లభిస్తోంది. ఈ పిక్సెల్ 8a ఫోన్ పింగాణీ, అబ్సిడియన్, బే అలో అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే రెండు వేరియంట్లలో 8GB ర్యామ్ కలిగి ఉంది.

పిక్సెల్ 8a సరసమైన ధరకే :
ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ వెర్షన్‌ ధర రూ. 34,999కి అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కొనుగోలుపై పూర్తి రూ. 5వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్ రియల్ ధర రూ. 29,999కి తగ్గుతుంది. ఈ డీల్‌ ద్వారా అసలు ధర కన్నా రూ.30వేలు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే, పిక్సెల్ 8a ఫోన్ ద్వారా రూ. 26,900 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ పిక్సెల్ ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Read Also : BSNL Silver Jubilee Plan : జస్ట్ రూ.225కే BSNL సిల్వర్ జూబ్లీ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5GB డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ప్రాసెసర్ :
టెన్సర్ G3 (టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో) ఫోన్‌తో వస్తుంది. సర్కిల్ టు సెర్చ్, ఏఐ పిక్చర్ ఎడిటింగ్ (మ్యాజిక్ ఎడిటర్), ఆడియో మ్యాజిక్ ఎరేజర్, బెస్ట్ టెక్ ఇతర ఏఐ ఫీచర్ల ద్వారా ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ 256GB వరకు UFS 3.1 స్టోరేజీ, 8GB LPDDR5x ర్యామ్ కలిగి ఉంది.

కెమెరాలు :
ఈ ఫోన్‌లో 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా అనే 2 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ :
ఈ ఫోన్ 4404mAh బ్యాటరీ, 18W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా ఫోన్ సపోర్టు ఇస్తుంది. ఛార్జింగ్ కోసం టైప్-C పోర్ట్ ఉంది. అలాగే, ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.