BSNL Silver Jubilee Plan : జస్ట్ రూ.225కే BSNL సిల్వర్ జూబ్లీ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5GB డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
BSNL Silver Jubilee Plan : బీఎస్ఎన్ఎల్ రూ.225 కొత్త సిల్వర్ జూబ్లీ ప్లాన్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 2.5GB రోజువారీ డేటా, ఫ్రీ ఎస్ఎంఎస్ 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌కు యాక్సెస్ లభిస్తుంది.
BSNL Silver Jubilee Plan
BSNL Silver Jubilee Plan : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ సిల్వర్ జూబ్లీ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ.225 ఉండగా, అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా ఫ్రీ SMS వంటి అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తుంది.
తద్వారా కంపెనీ సబ్‌స్క్రైబర్ బేస్‌ను (BSNL Silver Jubilee Plan) విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది. ట్రాయ్ నుంచి ఇటీవలి రిపోర్టులు కూడా ధృవీకరిస్తున్నాయి. రీఛార్జ్ ప్లాన్లు అత్యంత చౌకైన ధరకే లభిస్తుండటంతో ఎక్కువ మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చేరుతున్నారు.
బీఎస్ఎన్ఎల్ రూ. 225 సిల్వర్ జూబ్లీ ప్లాన్ వివరాలివే :
రూ. 225 సిల్వర్ జూబ్లీ ప్లాన్ ప్రీపెయిడ్ యూజర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తోంది. వినియోగదారులు రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాను కూడా పొందవచ్చు. ఆ తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది. BiTV కి ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్‌లు మల్టీ OTT యాప్ ఇంటిగ్రేషన్‌లతో పాటు 350+ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సస్ చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ఈ ప్లాన్ వివరాలను ఎక్స్ అకౌంట్ ద్వారా గతంలోనే ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. టెలికాం ప్రొవైడర్ పాపులర్ రూ.1 ప్లాన్ వ్యాలిడిటీని కూడా పొడిగించింది. హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ లాస్ట్ ఛాన్స్ :
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న పాపులర్ రూ. 1 రీఛార్జ్ ప్లాన్ కూడా లిమిటెడ్ టైమ్ వరకు అందుబాటులో ఉంది. నవంబర్ 18న ముగియనుంది.
A special plan for a special milestone!
Celebrate 25 years of BSNL with the ₹225 Silver Jubilee Plan.
Unlimited Calls | 2.5GB/Day | 100 SMS/Day | 30 Days Validity
🔗 Recharge Here https://t.co/yDeFrwK5vt#SwitchToBSNL #BSNL #PrepaidPlan #SilverJubileeCelebration pic.twitter.com/Hg6HQcGteG
— BSNL India (@BSNLCorporate) November 13, 2025
ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఇవే :
- 30 రోజుల వ్యాలిడిటీ
- అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
- రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
- రోజుకు 100 SMS బెనిఫిట్స్
- ఫ్రీ నేషనల్ రోమింగ్ కాల్స్
ఈ స్కీమ్ కొత్త సిమ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. ఫస్ట్ ఆగస్టు 15న ప్రవేశపెట్టగా కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ దీపావళి కోసం మాత్రమే ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. దేశీయ టెలికం మార్కెట్‌లో ఈ రీఛార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలపై బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీనిస్తోంది. ధర, ఎంటర్‌టైన్మెంట్, లాంగ్ వ్యాలిడిటీతో పాటు కొత్త ప్లాన్లు ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం చూసే యూజర్ల కోసం అందిస్తోంది.
