×
Ad

Schools Holiday 2025 : స్టూడెంట్స్‌కు పండగే.. ఈ డిసెంబర్‌లో 10 రోజులు స్కూళ్లకు సెలవులు.. ఏయే తేదీల్లో ఉన్నాయంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

Schools Holiday 2025 : డిసెంబర్ 2025లో విద్యార్థులకు భారీగా సెలవులు ఉంటాయి. ఇందులో శీతాకాల సెలవులు, క్రిస్మస్, ఇతర పండుగ సెలవులు ఉన్నాయి.

Schools Holiday 2025

Schools Holiday 2025 : డిసెంబర్ నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు.. ఈ డిసెంబర్‌లో మొత్తం 9 రోజుల నుంచి 10 రోజుల వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలు సహా అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లో శీతాకాల సెలవుల కారణంగా సెలవుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఇతర ఉత్తర భారత రాష్ట్రాలలో చలి తీవ్రత పెరగొచ్చు.

ఈ సమయంలో శీతాకాల సెలవులను (Schools Holiday 2025) పొడిగిస్తారు. అనేక జిల్లాల్లో, ప్రతికూల వాతావరణంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారు. చాలా ప్రాంతాలలో డిసెంబర్ నెలలో 10 రోజుల కన్నా ఎక్కువ రోజులు సెలవులు ఉండవచ్చు.

ఢిల్లీ NCR చుట్టూ ఉన్న స్కూళ్లకు క్రిస్మస్, గురు గోవింద్ సింగ్ జయంతి తర్వాత శీతాకాల సెలవులు పొడిగించవచ్చు. క్రిస్మస్ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా సెలవు ఉండవచ్చు. హర్యానాలో కూడా అమరవీరుడు ఉధమ్ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది. డిసెంబర్ 15 తర్వాత చలి తీవ్రతరం అయితే అనేక రాష్ట్రాల్లో శీతాకాల సెలవులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also : Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!

డిసెంబర్‌లో ఏయే రోజుల్లో స్కూళ్లకు సెలవులు ఉన్నాయంటే? :

  • డిసెంబర్ 7 (ఆదివారం) : వారపు సెలవు (దేశవ్యాప్తంగా)
  • డిసెంబర్ 14 (ఆదివారం) : వారపు సెలవు (దేశవ్యాప్తంగా)
  • డిసెంబర్ 19 : గోవా విముక్తి దినోత్సవం (గోవా)
  • డిసెంబర్ 21 (ఆదివారం) : వారపు సెలవు (దేశవ్యాప్తంగా)
  • డిసెంబర్ 24 : క్రిస్మస్ ఈవ్ (మేఘాలయ, మిజోరాం)
  • డిసెంబర్ 25 : క్రిస్మస్ (ప్రభుత్వ సెలవు)
  • డిసెంబర్ 26 : బాక్సింగ్ డే (మిజోరాం, తెలంగాణ)
  • డిసెంబర్ 27 : గురు గోవింద్ సింగ్ జయంతి (పంజాబ్, హర్యానా, చండీగఢ్)
  • డిసెంబర్ 28 (ఆదివారం) : వారతంపు సెలవు (దేశవ్యాప్తంగా)

10 రోజులు శీతాకాల సెలవులు :
హాఫ్ ఇయర్లీ పరీక్షలు డిసెంబర్‌లో ముగుస్తాయి. అందుకే బోర్డు పరీక్షలకు కాకుండా ఇతర తరగతుల విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు సాధారణంగా 10 రోజుల శీతాకాల సెలవులు ప్రకటిస్తాయి. పిల్లలు ఈ డిసెంబర్ నెలలో కూడా శీతాకాల సెలవులు 10 రోజులు ఉండవచ్చు. చలి తీవ్రతరం అయితే సెలవులను మరింత పొడిగించవచ్చు.