Second Hand Car : సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఈ తప్పు అస్సలు చేయొద్దు.. డీలర్లు దాచే నిజం ఇదే.. ఇలా చెక్ చేయండి!

Second Hand Car : సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే ముందు అది ప్రమాదానికి గురైందో లేదో ఎలా గుర్తించాలి? బాడీ గ్యాప్స్, పెయింట్, గ్లాస్, సర్వీస్ రికార్డులను చెక్ చేసేందుకు ఈజీ మెథడ్స్ ఇప్పుడు చూద్దాం..

Second-Hand Car Buying Tips

  • పాత కారు కొనే ముందు 90శాతం మంది చేసే తప్పులివే
  • పాత కారు పైకి బాగున్నా లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు
  • డీలర్ చెప్పిన మాటలు నమ్మి గుడ్డిగా పాత కారు కొనొద్దు
  • పాత కారు కొనేముందు ఈ టిప్స్ తప్పనిసరిగా తెలుసుకోండి

Second Hand Car : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే జర జాగ్రత్త.. ముందుగా ఈ విషయాలు తెలుసుకోకపోతే కారు కొన్నాక బాధపడినా ఫలితం ఉండదు. చాలామంది తక్కువ ధరకే వస్తుందని సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

మీ దగ్గర కొత్త కారు కొనే బడ్జెట్ లేదంటే పర్వాలేదు. కానీ, పాత కారు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి. చాలావరకూ పాత కార్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్న సమయంలో సరిగా చెక్ చేయకుండా తీసుకుంటే కొన్నతర్వాత బాధపడినా నో యూజ్..

ముఖ్యంగా పాత కారు కొనేటప్పుడు చూడాల్సిన వాటిలో ముఖ్యంగా గతంలో (Second Hand Car) ఏదైనా పెద్ద యాక్సిడెంట్‌కు గురైందా లేదా చెక్ చేయాలి. కొంతమంది పాత కారును అమ్మే ముందు కారు కండిషన్ గురించి పూర్తి విషయాలను చెప్పరు. కారు అమ్ముడు అవ్వాలని కొన్ని విషయాలను దాచిపెడతారు.

అందుకే మీరే కారును జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మీతో పాటు కారు మెకానిక్‌ని కూడా వెంట తీసుకెళ్లడం బెటర్. కారు కండిషన్ ఎలా ఉందో వారికి అయితే బాగా తెలుస్తుంది. గతంలో ఏదైనా ప్రమాదానికి గురైందా లేదా అని తెలుస్తుంది. పాత కారుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం..

కారు బాడీపై గ్యాప్ ఎక్కువగా ఉన్నాయా? :
కొత్త కారులో హుడ్, డోర్లు, ట్రంక్ మధ్య ఉండే గ్యాప్స్ సాధారణంగా అంతటా ఒకేలా ఉంటాయి. ఏదైనా పార్టు వద్ద ఖాళీ మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కనిపిస్తే లేదా డోర్ సరిగ్గా క్లోజ్ కాకపోతే ఆ పార్ట్ రిపేర్ చేయించినట్టే. యాక్సిడెంట్ తర్వాత బాడీ పార్టులను మారుస్తుంటారు. తద్వారా వాటి సెటింగ్ చేసినప్పుడు కొత్తదానిలో సమానంగా ఉండవు. హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

Read Also : Suzuki Swift Hydrogen : పెట్రోల్ కాదు, ఈవీ కాదు.. ఇకపై హైడ్రోజన్ కార్లు! మారుతి స్విఫ్ట్ కొత్త ఫ్యూచర్ టెక్నాలజీ ఇదే!

పెయింట్ చెకింగ్ మస్ట్ :
కారు పెయింట్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. కారుపై ఏదైనా తేడా లేదా మిగతా బాడీతో పోలిస్తే రంగులో లేదా షైనింగ్‌లో తేడా కనిపిస్తే కారుకు కంపెనీ పెయింట్ తర్వాత మళ్లీ కొత్తగా పెయింట్ వేసి ఉండొచ్చు.

రబ్బరు లైన్లు లేదా అంచులపై ఉండే పెయింట్ మరకలు ఉన్నా కూడా గతంలో ఎక్కువగా రిపేర్లు చేసినట్టే అర్థం. ఒక కంపెనీ వేసిన ఒరిజినల్ పెయింట్ సాధారణంగా చాలా స్మూత్ ఉంటుంది, అయితే, ఆ తర్వాత వేసిన పెయింట్ కాస్త గరుకుగా అనిపించవచ్చు.

బోనెట్, ఇంటీరియర్స్ తప్పక చెక్ చేయండి :
హుడ్ ఓపెన్ చేసి బోల్టులు సరిగా ఉన్నాయో లేదో జాగ్రత్తగా చెక్ చేయండి. ఏదైనా గుర్తులు లేదా ఊడిపోతున్న పెయింట్ ఉంటే.. ఆ పార్ట్ ఓపెన్ చేశారని అర్థం. ఇంజిన్ చుట్టూ ట్రంక్ లోపల వెల్డింగ్ గుర్తులు లేదా ఐరన్ వంగి ఉంటే ఆ కారు గతంలో భారీగా దెబ్బతిని ఉండవచ్చని గమనించాలి.

టెస్ట్ డ్రైవ్ చేయడం మర్చిపోవద్దు :
సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు తప్పకుండా టెస్ట్ డ్రైవ్ చేయండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ సౌండ్, స్టీరింగ్ పొజిషన్‌ చెక్ చేయండి. కారులో ఏదైనా అబ్ నార్మల్ సౌండ్ వచ్చినా లేదా స్టీరింగ్ మొత్తం ఒక సైడ్ లాగినా అది కూడా సమస్య కావచ్చు.

అద్దాలు, రికార్డులను కూడా చెక్ చేయండి :
అన్ని కారు విండోలపై తయారీ తేదీ ఉంటుంది. ఒకవేళ ఏదైనా విండోపై వేరే తేదీ ఉంటే.. మార్చి ఉండవచ్చు. అలాగే, కొత్త హెడ్‌లైట్ కూడా గతంలో యాక్సిడెంట్ జరిగిందని సంకేతం కావచ్చు. అలాగే, మీ సర్వీస్ రికార్డులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను కూడా తప్పకుండా చెక్ చేసుకోండి.