Several Users Face UPI Transaction Failures as Few Banks Hit by Technical Glitch
UPI Transaction Failures : యూపీఐ సర్వీసులు నిలిచిపోయాయి. కొన్ని గంటలుగా యూపీఐ లావాదేవీల విషయంలో సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయి. యూపీఐ వినియోగదారులు పేమెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. యూపీఐ లావాదేవీలు సరిగా జరగడం లేదని పోస్టులు పెడుతున్నారు.
బ్యాంకులతో కలిసి సమస్యను పరిష్కరిస్తున్నాం :
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లేదా యూపీఐ లావాదేవీ వైఫల్యాలకు కారణమైన కొన్ని బ్యాంకుల్లో అంతరాయం కారణంగా సర్వర్లు దెబ్బతిన్నాయని కంపెనీ ధృవీకరించింది. యూపీఐ కనెక్టివిటీలో అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఎందుకంటే.. కొన్ని బ్యాంకులు కొన్ని అంతర్గత సాంకేతిక సమస్యలను కలిగి ఉన్నాయని తెలిపింది. ఎన్‌పీసీఐ సిస్టమ్‌లు బాగానే పని చేస్తున్నాయని, త్వరిత పరిష్కారాన్ని నిర్ధారించడానికి బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నామని ట్విట్టర్ వేదికగా ఎన్‌పీసీఐ వెల్లడించింది.
Hi @HDFC_Bank @HDFCBank_Cares looks like your payments system is down.. UPI not working across any app.
— Ritesh Bendre (@GadgetFreak4U) February 6, 2024
డౌన్‌డెటెక్టర్ సర్వీసు రియల్ టైమ్ అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ప్రకారం.. (HDFC) బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, (SBI), కోటక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక బ్యాంకులు అంతరాయానికి గురైనట్లు చూపించాయి. యూపీఐ సేవల అంతరాయం గూగుల్ పే సర్వీసుల్లో కూడా కొన్ని సమస్యలను ట్రాకర్ వెబ్‌సైట్ చూపింది. అయితే, బ్యాంక్ సర్వర్‌లలో అధిక ట్రాఫిక్ కారణంగా ఇది కొన్నిసార్లు జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది.
నిలిచిపోయిన బ్యాంక్ సర్వర్లు :
గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగించి చెల్లింపులు చేస్తున్నప్పుడు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో అనేక బ్యాంకుల సర్వర్‌లు సర్వీసు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. చాలా మంది కస్టమర్‌లు ట్విట్టర్ వేదికగా తమ సమస్యల గురించి పోస్ట్ చేస్తున్నారు.
Several Users Face UPI Transaction Failures
దాదాపు 250 రిపోర్టులలో పేమెంట్ల బదిలీకి సంబంధించిన 60 శాతం రిపోర్ట్ సమస్యలు, మొబైల్ బ్యాంకింగ్‌లో 35 శాతం మార్క్ సమస్యలు, ఇతరులు అకౌంట్లలో బ్యాలెన్స్‌లో అవాంతరాలను ఎదుర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికొస్తే.. ఖాతాదారులు 75 శాతం మనీ ట్రాన్సాక్షన్, 14 శాతం లాగిన్ సమస్యలు, ఇతరులు ఏటీఎం సర్వీసుల్లో సమస్యలను రిపోర్టు చేశారు.
Hey @HDFC_Bank
If your UPI servers are down for some kind of maintenance or some technical breakdown, at least have the courtesy to share a communication.
— Varadraj Adya (@varadadya) February 6, 2024
UPI down?
— Manish Virgat (@manish_virgat) February 6, 2024
Read Also : HP Spectre Laptops : భారత్‌లో హెచ్‌పీ కొత్త స్పెక్టర్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలుసా?