Share Markets : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం (నవంబర్ 8) భారీ లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో దూసుకెళ్లిన మార్చెట్లు.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి.

Share Market End : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం (నవంబర్ 8) భారీ లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో దూసుకెళ్లిన మార్చెట్లు.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 60,385.76 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభం కాగా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. దాదాపు మధ్యాహ్నం వరకు అలానే ఊగిసలాటలో సాగింది. మధ్యాహ్నం 12గంటల తర్వాత సూచీలు పైకి ఎగిశాయి. కీలక కంపెనీలకు కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను చేరుకున్నాయి.

సెన్సెక్స్ ఇంట్రాడేలో 59,779.19 నుంచి 60,609.16 మధ్య సాగింది. చివరకు 477.99 పాయింట్ల లాభంతో 60,545.61 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 17,836.10 వద్ద కనిష్ఠాన్ని చేరుకోగా.. 18,087.80 వద్ద గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 151.75 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 18,068.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ కూడా రూ.74.01 వద్ద స్థిరంగా నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో 22 షేర్లు వరకు లాభపడ్డాయి. టైటన్ అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, కొటాక్మహీంద్రా బ్యాంక్, hdfc, ntpc, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ కంపెనీలు లాభాల బాటపట్టాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, sbi, మారుతీ, ఏషియన్ పెయింట్స్, tcs, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు మరింత లాభాల దిశగా కొనసాగాయి. పెట్రో ధరల తగ్గింపు, అమెరికాలో ఉద్యోగ కల్పన వంటి పరిణామాలు కూడా సూచీలపై సానుకూల ప్రభావం పడింది.
Read Also : world largest joystick : 9 అడుగులు పొడవైన జాయ్‌స్టిక్‌ కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

ట్రెండింగ్ వార్తలు