world largest joystick : 9 అడుగులు పొడవైన జాయ్‌స్టిక్‌ కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

డార్ట్​మౌత్​ కళాశాలకు చెందిన ప్రొఫెసర్​ మేరీ ఫ్లానగన్ రూపొందించిన 9 అడుగులు పొడవైన జాయ్‌స్టిక్‌ కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కింది.

world largest joystick : 9 అడుగులు పొడవైన జాయ్‌స్టిక్‌ కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

World Largest Joystick

world’s largest joystick : అది వీడియో గేమ్ జాయ్​స్టిక్. దాని పొడవు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. తొమ్మిది అడుగుల పొడుగు. అది అంత పొడుగు ఉండటం వల్లనే గిన్నిస్​ వరల్డ్ రికార్డ్స్​-2022లో చోటు దక్కించుకుంది.9 అడుగులు పొడవైన ఈ జాయ్‌స్టిక్‌ ప్రపంచంలోనే అత్యంత పొడవైనది. ఈ జాయ్​స్టిక్ ను జర్మనీలోని డార్ట్​మౌత్​ కళాశాలకు చెందిన ప్రొఫెసర్​ మేరీ ఫ్లానగన్​ తయారు చేశారు. కలప, రబ్బరు, స్టీల్​తో ఈ 2.7మీటర్ల స్టిక్ ను రూపొందించారు ప్రొఫెసర మేరీ. అటారీ వీడియో గేమ్స్​ ఆడేందుకు ఉపయోగించే సాధారణ జాస్టిక్​ కంటే ఈ స్టిక్ 14 రెట్లు అధిక ఎక్కువ పొడుగు ఉంటుంది. ఈ స్టిక్ ను ఆపరేట్ చేయాలంటే కనీసం ఇద్దరు ఉండాలి. ఓ పక్క ఒకరు. మరోపక్క మరొకరు ఉండాల్సిందే.

Read more : Toothbrush Sculpture : 80,000 టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌.. గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన డాక్టర్‌ రెడ్డీస్‌

దీన్ని తయారు చేసిన ప్రొఫెసర్ మేరీ ప్లానగన్ మాట్లాడుతు..చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్​ అంటే తనకు ఎంతో ఇష్టమని..వీడియో గేమ్ లకు అడిక్ట్ అయ్యానని తెలిపారు. ఒక్కరు వీడియో గేమ్ ఆడుతంటే ఆ ఫీలింగ్ మరొకరు కూడా పొందితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేసానని మేరీ తెలిపారు.

Read more : India : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం

దీనితో సెంటీపీడ్, బ్రేక్ఔట్​ వంటి అటారీ గేమ్స్ ఆడుకోవచ్చనీ..వీడియో గేమ్స్​ అలవాటు లేని వారిని కూడా గేమ్​లో ఇన్వాల్వ్ చేసే తమాషాగా ఉంటుందన్నారు. గిన్నిస్ రికార్డులకెక్కిన​ జాయ్​స్టిక్ఈ జాయ్​స్టిక్​ను స్పెయిన్​, బ్రిటన్, అమెరికాలో కూడా ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఇప్పుడు జర్మనీ కార్ల్స్​రూహిలోని ZKM ఆర్ట్ అండ్ మీడియా సెంటర్​ శాశ్వాత సేకరణలో భాగమైంది.

Read more : Kid Poem ‘smelly dad’ : మా నాన్న ఫైజర్..ఎప్పుడు వాడడు రేజర్,మా నాన్న బొడ్డు కంపు : ఐదేళ్ల చిన్నారి కవిత వైరల్