Silver price: సిల్వర్ ధర కిలోకు రూ.2 లక్షల మార్కును దాటింది. పెట్టుబడిదారుల్లో వెండిపై ఆసక్తి పెరగడం, ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో నాలుగు రోజులుగా వెండి ధరలు వరుసగా ఎగబాకాయి. మార్చ్ డెలివరీ కాంట్రాక్టులు రూ.1,420 (0.71 శాతం) పెరిగి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‍లో (MCX) కిలోకు ఆల్‌టైమ్ హై రూ.2,00,362 చేరాయి.
అంతర్జాతీయంగా కోమెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్సుకు 64.74 డాలర్లకు చేరి, కొత్త గరిష్ఠాన్ని తాకాయి. కోమెక్స్ అంటే అమెరికాలోని కమోడిటీ ఎక్స్చేంజ్.
అవుట్‌లుక్ ఏంటి?
వెండి ధర మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫాక్టర్లు, మాన్యుఫాక్చరింగ్ డిమాండ్, రూపాయి డిప్రెషియేషన్ ఇందుకు కారణమని అంటున్నారు.
ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సిల్వర్ గ్లోబల్, డొమెస్టిక్ మార్కెట్లలో బంగారం కంటే మెరుగ్గా పర్ఫార్మ్ చేస్తోంది” అని అన్నారు. పరిశ్రమ డిమాండ్, బ్రాడర్ డాలర్ సాఫ్ట్‌నెస్ ఇందుకు కారణమని పేర్కొన్నారు.
మెహతా ఈక్విటీస్‌కి చెందిన రాహుల్ కలంత్రి స్పందిస్తూ.. “సిల్వర్ ధర మరో రికార్డు స్థాయికి చేరుకుంది. $65/ఔన్స్ వైపు కదులుతోంది” అని తెలిపారు. స్ట్రాంగ్ గ్లోబల్ ఫాక్టర్లు, రూపాయి వీక్‌నెస్ డొమెస్టిక్ బులియన్ ధరలను ఎలివేటెడ్‌గా ఉంచుతాయని పేర్కొన్నారు.
పృథ్వి ఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కి చెందిన మనోజ్ కుమార్ జైన్ టెక్నికల్ పర్స్పెక్టివ్ గురించి వివరించారు. సిల్వర్ ట్రేడింగ్ రేంజ్ రూ.1,96,600-రూ.2,04,000 మధ్య ఉంటుందని చెప్పారు.
“బంగారం, వెండిలో కొత్త లాంగ్ పొజిషన్ల కోసం కొంత కరెక్టివ్ డిప్స్ వరకు వేచి ఉండాలి. ఈ రెండు విలువైన లోహాలలో షార్ట్ సెల్లింగ్ కచ్చితంగా అవాయిడ్ చేయాలి” అని ఆయన సూచించారు.