SIP Calculator : ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ. 3వేలు SIP చేస్తే 10 ఏళ్లలో ఎంత సంపాదిస్తారంటే?
SIP Calculator : లాంగ్ టైమ్ SIP మాత్రమే అధిక రాబడిని అందిస్తుంది. మీ SIPని ఎప్పుడూ 5 ఏళ్ల కన్నా ఎక్కువ కాలపరిమితితో మొదలుపెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల తక్కువగా ఎఫెక్ట్ అవుతాయి.. 10ఏళ్లలో ఎస్ఐపీ చేస్తే ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు చూద్దాం..
SIP Calculator ( Image Credit : Gemini AI )
- ఎస్ఐపీలో కొత్తగా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా?
- ప్రతినెలా రూ. 3వేలు పెట్టుబడి పెడితే 10ఏళ్లలో రాబడి ఎంతంటే?
- లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేసేవారికి SIPలో ఉండే బెనిఫిట్స్ ఏంటి?
SIP Calculator : ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? ఎందులో చేస్తే బాగుంటుందో అర్థం కావడం లేదా? అయితే మీకోసం అద్భుతమైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఉంది. అదే.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP). లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేయాలని చూసేవారికి ఈ ఎస్ఐపీ అద్భుతంగా ఉంటుంది.
మీరు క్రమశిక్షణతో మంచి పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీగా డబ్బులు (SIP Calculator) సంపాదించుకోవచ్చు. విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనశైలికి అవసరాలు భారీగా పెరిగిపోతున్నాయి. మీ డబ్బులను పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం అత్యవసరం. అదృష్టవశాత్తూ, కాంపౌండింగ్ అద్భుతం కారణంగా చిన్న నెలవారీ పెట్టుబడి కూడా కాలక్రమేణా భారీ మొత్తంలో కూడబెట్టుకోవచ్చు అనమాట.
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇందులో మీరు ప్రతి నెలా ఒక స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. మీ జీతం తీసుకునే ఉద్యోగి అయినా, గృహిణి అయినా, లేదా చిన్న మొత్తంతో ప్రారంభించే యువ ఉద్యోగి అయినా చాలా మధ్యతరగతి కుటుంబాలకు నెలకు రూ. 3వేలు పెట్టుబడి సరిపోతుంది.
10 ఏళ్ల కాలం పాటు ఇలా చేస్తూ పోతే పిల్లల చదువు, ఫ్యామిలీ టూర్ లేదా ఇంటి డౌన్ పేమెంట్ వంటి వాటికి భారీ మొత్తాన్ని కూడబెట్టవచ్చు. నెలకు రూ. 3,000 పెట్టుబడి పెట్టడం ద్వారా 10 ఏళ్లలో మీరు ఎంత కూడబెడతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Read Also : UIDAI mAadhaar App : యూఐడీఏఐ బిగ్ అలర్ట్.. ‘మైఆధార్’ ఇక పనిచేయదు.. కొత్త ‘Aadhaar’యాప్‌కు ఇలా మారండి..!
అలాగే, రాబడులు 12శాతం వార్షిక రాబడి చొప్పున లెక్కించవచ్చు. సంవత్సరానికి 12శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 3వేలు పెట్టుబడి 10 ఏళ్లలో ఎంత పెరుగుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు.
- నెలవారీ పెట్టుబడి: రూ. 3,000
- అంచనా రాబడి : 12 శాతం
- పెట్టుబడి కాలం : 10 ఏళ్లు
- మొత్తం పెట్టుబడి : రూ. 3.6 లక్షలు
- అంచనా రాబడి : రూ. 3.12 లక్షలు
- మెచ్యూరిటీ కార్పస్ : రూ. 6.72 లక్షలు
లాంగ్ టైమ్ పెట్టుబడి పెట్టండి :
అసలైన వృద్ధి అనేది మీ పెట్టుబడులపై రాబడి నుంచే వస్తుంది. భారత మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లు ముఖ్యంగా ఈక్విటీ-ఆధారిత ఫండ్లు, చారిత్రాత్మకంగా లాంగ్ టైమ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ డేటా కాంపౌండింగ్ పవర్ పెంచుతుంది. మీ డబ్బు అసలు మాత్రమే కాదు లాభాలపై కూడా రాబడిని అందిస్తుంది.
ఎస్ఐపీలు రూపాయి-కాస్ట్ యావరేజింగ్ కాంపౌండింగ్ పవర్ ఆధారంగా పనిచేస్తాయి. మీరు రెగ్యులర్ ఒక ఫిక్సడ్ అమౌంట్ పెట్టుబడి పెట్టాలి. మార్కెట్లు తక్కువగా ఉంటే ఎక్కువ యూనిట్లు, ఎక్కువగా ఉంటే తక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తారు. దాంతో మీ పెరిగే బ్యాలెన్స్‌పై రాబడులు కాంపౌండ్ అవుతాయి.
10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 3వేలు పెట్టుబడి పెడితే చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ, అది రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షలు లేదా ఆపై ఆర్థిక భద్రతను అందిస్తుంది. చివరి మొత్తం ఎక్కువగా రాబడి రేటుపై ఆధారపడి ఉంటుంది. ఫండ్ టైమ్, మార్కెట్ బట్టి మారుతుంది.
