SIP చేస్తున్నారా? చేద్దామనుకుంటున్నారా? ఎంతకాలం చేయాలో తెలుసుకోండి..!

SIP Investment Plan : 7 ఏళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కొనసాగించిన తర్వాత, మిడ్-క్యాప్ కేటగిరీకి నష్టాన్ని చవిచూసే అవకాశాలు 0 శాతం, స్మాల్-క్యాప్ కేటగిరీకి 5.8శాతంగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు.

SIP for how long_ Motilal Oswal timeline

SIP Investment Plan : పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? ఎందులో పెట్టుబడి పడితే డబ్బులు ఎక్కువగా వస్తాయాని ఆలోచిస్తున్నారా? మీరు స్మాల్, మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టి చూడండి. మీరు ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే.. పెట్టుబడిదారులు కోరుకునే ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్లలో (SIP) గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. గత జనవరిలో, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ భారీ పెట్టుబడులను చవిచూసింది.

ఫలితంగా మేనేజెంంట్ అసెట్స్ (AUM) రూ. 67.25 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో, వివిధ మార్కెట్ క్యాప్‌లలో గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్‌లు రూ. 5,148 కోట్లుగా ఉండగా, స్మాల్-క్యాప్ ఫండ్‌లు రూ. 5,721 కోట్లు ఆకర్షిస్తున్నాయి. అయితే, కొత్త రిజిస్ట్రేషన్లతో పోలిస్తే.. నిలిచిపోయిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIP) ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీనిపై ఇన్వెస్టర్లలో అనేక ఆందోళనలు, ప్రశ్నలను లేవనెత్తింది.

Read Also : Indian deportees : అమెరికా నుంచి రెండో బ్యాచ్ దిగింది.. అమృత్‌సర్‌లో ల్యాండ్.. ఈసారి 119 మంది భారతీయులు వెనక్కి..!

మోతీలాల్ ఓస్వాల్ డేటా ప్రకారం.. :
మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషించిన డేటా ఆధారంగా పరిశీలిస్తే.. స్మాల్, మిడ్-క్యాప్ స్టాక్స్ వంటి అస్థిర మార్కెట్లలో ప్రారంభ ఏడు సంవత్సరాల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) రాబడిపై ఎక్కువగా ప్రభావం చూపింది.

మార్కెట్ అంచనాలతో సంబంధం లేకుండా ఒకవేళ మీరు గాని సిప్‌లో అదే కాలంలో పెట్టుబడి పెడితే గణనీయమైన లాభాలను కూడా పొందవచ్చునని విశ్లేషణ సూచిస్తుంది. మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో 7 ఏళ్ల సిప్ కోసం పెట్టుబడి పెట్టినా కూడా నష్టం సంభావ్యత కేవలం 5.8 శాతం మాత్రమేనని గమనించాలి.

నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్-క్యాప్ 150, నిఫ్టీ స్మాల్-క్యాప్ 250, నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50:25:25తో సహా వివిధ సూచీలకు 5, 7, 10 సంవత్సరాల కాలాల్లో నెలవారీ రోలింగ్ SIP రాబడిని మోతీలాల్ ఓస్వాల్ డేటా పరిశీలించింది. ఈ విశ్లేషణలో 2008-2009 ఆర్థిక సంక్షోభం, 2013 అమ్మకాలు, ఇటీవలి మహమ్మారి వంటి కీలకమైన మార్కెట్ సంఘటనలను సూచిస్తుంది.

ఈ సందర్భాల్లో సిప్ పెట్టుబడులను కొనసాగించిన పెట్టుబడిదారులు సానుకూల రాబడిని సాధించారని డేటా స్పష్టంగా చెబుతోంది. అలాగే, 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పెట్టుబడి పరిమితిని కలిగి స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్, లార్జ్-క్యాప్‌తో సహా వివిధ సూచికలలో నష్టాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని నివేదిక పేర్కొంది.

సిప్ పెట్టుబడి ఎలా :
7 ఏళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) తర్వాత, మిడ్-క్యాప్ కేటగిరీకి నష్టాన్ని చవిచూసే అవకాశాలు 0 శాతం, స్మాల్-క్యాప్ కేటగిరీకి 5.8శాతమని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. పెట్టుబడి వ్యవధిని 10 సంవత్సరాలకు పొడిగించడం వల్ల మిడ్-క్యాప్‌కు 0 శాతం, స్మాల్-క్యాప్‌కు 0.8 శాతం నష్ట సంభావ్యత తగ్గుతుంది.

5 ఏళ్ల కాలంలో సంభావ్యత మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్‌కు వరుసగా 2.2 శాతం, 11.7 శాతానికి మారుతుంది. అందువల్ల, సిప్ పెట్టుబడికి ప్రారంభ 7 ఏళ్లు కట్టుబడి ఉంటే అధిక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఒకవేళా వివాహం చేసుకున్నా లేదా స్మాల్-క్యాప్ కేటగిరీలో పెట్టుబడి పెట్టినా, మొదటి 7 ఏళ్లు అలానే కొనసాగిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

అత్యంత చెత్త సంవత్సరం ఇదే :
గత 7 ఏళ్లలో నిఫ్టీ 100 0.8 శాతం రాబడితో అత్యంత చెత్త సంవత్సరాన్ని చవిచూసింది. అయితే, విత్‌డ్రా చేయకుండా పెట్టుబడి పెట్టడం, సిప్ కొనసాగించడం వల్ల మరుసటి సంవత్సరం 15.1శాతం రాబడి వచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150కి, అత్యల్ప వార్షిక రాబడి 0.4శాతం, కానీ, ఆ తర్వాతి సంవత్సరం 20.4 శాతం రాబడి వచ్చింది.

నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 గత 7 ఏళ్లలో కనిష్ట స్థాయిలో 7.3 శాతం రాబడిని పొందింది. కానీ, ఆ తర్వాతి సంవత్సరం 14.8 శాతం రాబడితో పుంజుకుంది. అదేవిధంగా, నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50:25:25 7 సంవత్సరాలలో అత్యంత చెత్త రాబడిని -2.0 శాతం వద్ద చూసింది. ఆ తర్వాతి సంవత్సరం 16.5 శాతంతో రాబడితో తిరిగి పుంజుకుంది.

Read Also : Resume Tips : మీ రెజ్యూమ్‌ ఇలా రెడీ చేయండి.. మీకు జాబ్ పక్కా.. కానీ, ఈ 6 మిస్టేక్స్ అసలు చేయొద్దు..!

10 ఏళ్ల కాలంలో నిఫ్టీ100 అనేది 2.8శాతం రాబడితో అత్యంత చెత్త సంవత్సరాన్ని చవిచూసింది. అయితే, సిప్ విత్‌డ్రా చేయకుండా లేదా కొనసాగించకుండా తమ పెట్టుబడులను నిలుపుకున్న పెట్టుబడిదారులు మరుసటి సంవత్సరం 13.6 శాతం రాబడిని పొందారు. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 4.6 శాతం వద్ద అత్యల్ప వార్షిక రాబడిని పొందింది. కానీ, ఆ తరువాతి సంవత్సరం 18 శాతం రాబడితో తిరిగి పుంజుకుంది.

మరోవైపు, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 దశాబ్దంలో -1.8 శాతం రాబడితో అత్యంత చెత్త సంవత్సరాన్ని చవిచూసింది. కానీ, ఆ తరువాతి సంవత్సరం 13.3 శాతం రాబడితో తిరిగి పుంజుకుంది. అదేవిధంగా, నిఫ్టీ500 మల్టీక్యాప్ 50:25:25 2.2 శాతం రాబడితో అత్యంత చెత్త సంవత్సరాన్ని చవిచూసింది. కానీ, ఆ తరువాతి సంవత్సరం 14.7 శాతం రాబడికి గణనీయమైన లాభాలను పొందింది.