Skoda Kylaq SUV : స్కోడా కైలాగ్ ఎస్‌‌యూవీ సరికొత్త రికార్డు.. కేవలం 10 రోజుల్లోనే 10వేల బుకింగ్స్..!

Skoda Kylaq SUV : స్కోడా కైలాగ్ కారు.. ఇంకా మార్కెట్లోకి రాక ముందే ఫుల్ డిమాండ్ పెరిగింది. కేవలం 10 రోజులకే 10వేల బుకింగ్‌లకు చేరుకుంది.

Skoda Kylaq SUV Hits 10k Bookings

Skoda Kylaq SUV : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా నుంచి సరికొత్త సరికొత్త కైలాక్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది. ఇంకా మార్కెట్లోకి రాక ముందే ఫుల్ డిమాండ్ పెరిగింది. కేవలం 10 రోజులకే 10వేల బుకింగ్‌లకు చేరుకుంది. స్కోడా రేంజ్‌లో ఈ కొత్త మోడల్ కారు చేరనుంది.

ఈ స్కోడా కైలాక్ మోడల్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 14.40 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంటుంది. కంపెనీ లైనప్‌లో అతి చిన్న మోడల్. ఇందులో విశేషమేమిటంటే.. ఈ బుకింగ్‌లు ఆన్‌లైన్ డేటా ఆధారంగా షోరూమ్‌లలో ఎస్‌యూవీ అందుబాటులోకి రాకుండానే వచ్చాయి.

వచ్చే ఏడాది జనవరి 27, 2025 వరకు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం లేదు. అప్పటివరకూ కస్టమర్‌లు స్కోడా కైలాక్ టెస్ట్ డ్రైవ్ చేయలేరు. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్రా జనేబా మాట్లాడుతూ.. “షోరూమ్‌లో కారు లేకుండా 10 రోజుల్లోనే 10వేలు బుకింగ్‌లు అయ్యాయి.

కైలాగ్ పూర్తిగా కొత్త కారు.. అది కూడా కొత్త సబ్-4ఎమ్ ఎస్‌యూవీ విభాగంలో.. ఈ 10వేల బుకింగ్స్ కస్టమర్‌లు కైలాక్‌ను పొందే అవకాశం లేకుండానే వచ్చాయి. స్కోడా బ్రాండ్‌పై సాటిలేని నమ్మకాన్ని అందిస్తుంది. కైలాక్ భారతీయ రహదారులపై యూరోపియన్ టెక్నాలజీని విస్తరించేలా చేస్తుందని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అధికారిక లాంచ్‌కు ముందే స్కోడా ఆటో ఇండియా ‘డ్రీమ్ టూర్’ని ప్రారంభించింది.

రాబోయే 43 రోజులలో 3 స్కోడా కైలాక్ ఎస్‌యూవీలు దేశవ్యాప్తంగా 70 నగరాలను సందర్శిస్తాయి. పెద్దమొత్తంలో కస్టమర్‌లు కారును వ్యక్తిగతంగా చూసేందుకు అవకాశాన్ని ఇస్తారు. “ఇండియా ‘డ్రీమ్ టూర్’ కైలాక్‌ మరింత మంది అభిమానులకు చేరువ చేస్తుంది. ప్రత్యేక ఫీచర్లు, ఆధునిక డిజైన్‌లతో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్కోడా కైలాక్ సబ్-4-మీటర్ ఎస్‌యూవీ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో లభిస్తుంది. అన్ని-ఎల్ఈడీ లైటింగ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లు కలిగి ఉన్నాయి.

Read Also : Chess Champion Gukesh : చెస్ ఛాంపియన్ గుకేష్‌కు ఎలన్ మ‌స్క్ అభినందనలు..!