Small Savings Interest Rates
Small Savings Interest Rates : పెట్టుబడిదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటించింది. పీపీఎఫ్, ఎస్ సీఎస్ఎస్, ఎన్ఎస్‌సీ, ఎస్ఎస్‌వై, కేవీపీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, టైమ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వంటి అన్ని చిన్న పొదుపు పథకాల పూర్తి వడ్డీ రేట్లను వెల్లడించింది.
ప్రభుత్వం వరుసగా 7వ త్రైమాసికంలో (Small Savings Interest Rates) కూడా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చలేదు. PPF, NSC సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు అక్టోబర్ 1, 2025 నుంచి యథాతథంగా ఉంటాయి.
“2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి, అక్టోబర్ 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025తో ముగిసే వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జూలై 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు) నోటిఫై చేసిన వడ్డీ రేట్ల మారవు” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ :
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లు 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. అదే సమయంలో, 3 సంవత్సరాల టర్మ్ (ఫిక్స్‌డ్) డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుత త్రైమాసికంలో 7.1 శాతంగా ఉంటుంది. ప్రముఖ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు కూడా వరుసగా 7.1 శాతం, 4 శాతంగా ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్ర (KVP) 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక పెట్టుబడి 115 నెలల్లో మెచ్యూరిటీ పొందుతుంది.
NSCపై వడ్డీ రేటు 7.7 శాతం :
2025 అక్టోబర్-డిసెంబర్ కాలానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల (NSC) వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంటుంది. ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే నెలవారీ ఆదాయ పథకం పెట్టుబడిదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 7.4 శాతం వడ్డీని అందిస్తారు.
అదనంగా, చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు, ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవు. వరుసగా 6వ త్రైమాసికంలోనూ మారలేదు. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2023-24 నాల్గవ త్రైమాసికానికి కొన్ని పథకాల్లో మార్పులు చేసింది. చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వెల్లడిస్తుంది.