Solis New Tractors : గ్లోబల్ మార్కెట్లోకి సోలిస్ నుంచి 2 సరికొత్త ట్రాక్టర్లు.. పూర్తి వివరాలివే..!

Solis New Tractors : సోలిస్ ట్రాక్టర్ బ్రాండ్ నుంచి రెండు సరికొత్త ట్రాక్టర్లు లాంచ్ అయ్యాయి. ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఈ రెండు ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Solis unveils 2 new tractors for global markets

Solis New Tractors Launch : ప్రముఖ ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ITL)లో భాగమైన సోలిస్ ట్రాక్టర్స్.. అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం రెండు సరికొత్త ట్రాక్టర్‌లను లాంచ్ చేసింది. సోలిస్ S 75 షటిల్ XL, సోలిస్ C 48 మోడల్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది. యూకేలో వ్యవసాయ యంత్రాలు, డివైజ్‌లు, సర్వీసుల ప్రదర్శన షోలో ఈ రెండు ట్రాక్టర్లను ఆవిష్కరించారు. సోలిస్ S 75 షటిల్ XL మోడల్ ఎస్-టెక్ 4-సిలిండర్ ఇంజన్, 12ఎఫ్+12ఆర్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తుంది. ఎస్-బూస్ట్ హైడ్రాలిక్స్, 3వేల కిలోల లిఫ్టింగ్ కెపాసిటీతో వస్తుంది.

Read Also : Apple iPad Air Launch : ఆపిల్ అతిపెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలివే

ట్రాక్టర్ల ఎగుమతిలో అగ్రగామిగా ఐటెల్ :
సోలిస్ సి48 3-సిలిండర్ సహజంగా-ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 146.2ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాక్టర్ 12ఎఫ్+12ఆర్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది. ఎస్-బూస్ట్ హైడ్రాలిక్‌లను కలిగి ఉంటుంది. సోలిస్ ప్రకారం.. ఎస్75 షటిల్ ఎక్స్ఎల్, సి48 రెండూ యూఎస్‌ఏ, యూరప్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లలో విక్రయిస్తున్నాయి.

ఈ ట్రాక్టర్ల ధరను కంపెనీ వెల్లడించలేదు. 1996లో స్థాపించిన ఐటీఎల్ భారత్‌లో మూడవ అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు, వాల్యూమ్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఐదవది. ఎఫ్‌వై23లో దాదాపు 35వేల యూనిట్లను పంపి గత 4 ఏళ్లలో భారత్ నుంచి ట్రాక్టర్లను ఎగుమతి చేసే కంపెనీగా అగ్రగామిగా కొనసాగుతోంది. కంపెనీ ఆర్థిక సంవత్సరంలో 28శాతం, హెచ్1 ఆర్థికసంవత్సరం 2024లో 36శాతం ఎగుమతి మార్కెట్ వాటాను కలిగి ఉంది.

Solis new tractors 

150 దేశాలకు ఐటీఎల్ మోడల్స్ ఎగుమతి :
సోలిస్ కాకుండా ఐటీఎల్ సోనాలికా బ్రాండ్‌తో ట్రాక్టర్లను విక్రయిస్తుంది. కంపెనీ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తయారీ ప్లాంట్ కలిగి ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3లక్షల యూనిట్లను కలిగి ఉంది. లక్ష యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌కు ఆనుకుని కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఎఫ్‌వై (FY26) నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. 16హెచ్‌పీ-125హెచ్‌పీ శ్రేణిలో ట్రాక్టర్‌లను కలిగిన ఐటీఎల్ మోడల్‌లను 150 దేశాలకు ఎగుమతి చేస్తుంది. అందులో ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఐస్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, అల్జీరియాతో సహా 14 దేశాల్లో అతిపెద్ద ట్రాక్టర్ బ్రాండ్ అందుబాటులో ఉంది.

Read Also : Kia Seltos Diesel MT Launch : కియా సెల్టోస్ డీజిల్ ఎంటీ మోడల్ కారు వచ్చేసింది.. మొత్తం 5 మోడల్స్.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?