Gold : రానున్న రోజుల్లో మరింతగా తగ్గునున్న బంగారం ధ‌ర‌..! ట్రంప్ విక్టరీ పుణ్యమేనా..?

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎప్పుడు తగ్గాలో బంగారానికి బాగా తెలిసినట్టుంది.

Special Focus On Gold Rates in coming days gold price will decrease

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎప్పుడు తగ్గాలో బంగారానికి బాగా తెలిసినట్టుంది. ఇన్నాళ్లు పరుగులు తీసిన పసిడి ధరలు.. ఇప్పుడు పంతం వీడి నేల చూపులు చూస్తున్నాయి. తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన గోల్డ్ రేట్స్.. సడన్‌గా తగ్గుముఖం పట్టి సప్రైజ్ ఇస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్‌.. ఇక బంగారం దిగిరావడంతో.. పెళ్లి కూతుళ్ల తల్లిదండ్రులు ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే ఇదంతా ట్రంప్ విక్టరీ పుణ్యమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి ట్రంప్ విజయానికి బంగారం ధరలకు లింకు ఏంటి? ఇప్పుడు లేనిది సడన్‌గా బంగారం రేట్స్‌ ఎందుకు దిగివస్తున్నాయి.

గోల్డ్‌ మార్కెట్‌ వెలవెలబోతున్నది. దేశీయ విపణిలో 10 రోజుల కిందటి దాకా ఆల్‌టైమ్‌ హైలను తాకిన బంగారం ధరలు.. ఇప్పుడు దిద్దుబాటుకు గురవుతున్నాయి. రోజుకింత తగ్గుముఖం పడుతున్నాయి. గత పది రోజుల్లో గోల్డ్‌ రేట్‌ దాదాపు 8శాతం తగ్గి నెల రోజుల కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం 10 గ్రాముల ప్యూర్‌ గోల్డ్‌ 14వందల 70 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్‌ మార్కెట్లో ప్యూర్‌ గోల్డ్‌ 10 గ్రాములు 77 వేల 290 రూపాయలు, 22 క్యారెట్లు 10గ్రాముల ధర 70వేల 850 రూపాయలు పలుకుతోంది. ఇక సిల్వర్‌ విషయానికి వస్తే గోల్డ్‌ రూట్‌లోనే పయనిస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్లో 2వేల రూపాయలు తగ్గిన కిలో వెండి ధర లక్ష రూపాయలు పలుకుతోంది.

48 లక్షల పెళ్లిళ్లు..

అసలే పెళ్లిళ్ల సీజన్.. దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. 6 లక్షల కోట్ల బిజినెస్ జరగనుంది. పెళ్లిళ్ల సమయంలో జరిగే బిజినెస్లో బంగారందే అగ్ర స్థానం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో బంగారం ధర తగ్గడం శుభ పరిణామమనే చెప్పాలి. ధన త్రయోదశి సమయంలో కూడా బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. బంగారం ధరలు చుక్కలు చూపిస్తుండడంతో కొనుగోలుదారులను ఆకర్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జనం మొగ్గుచూపలేదు. ఈసారి అమ్మకాలు 30 శాతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

Gold Price : మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఆ సమయంలో గోల్డ్ కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారం అంతగా మమేకమైపోయింది మరి. ఇది కేవలం అలంకరణగా మాత్రమే కాదు.. పెట్టుబడులకు కూడా మంచి సాధనంగా మారింది. ఇంకా.. సంక్షోభ సమయాల్లో కూడా బంగారం.. సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుంటారు. అందుకే గోల్డ్‌కు డిమాండ్ అంతలా ఉంటుంది. అంతర్జాతీయ అంశాలెన్నో బంగారం ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా యూఎస్ డాలర్, ఫెడ్ వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వాటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.

అక్టోబర్ చివరి వరకు గోల్డ్ రేట్లు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్- ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులతో సంక్షోభ సమయంలో డాలర్ డిమాండ్ తగ్గి.. సురక్షిత పెట్టుబడి అయిన బంగారం విలువ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ గరిష్టాల్ని కూడా తాకింది. ఇది అక్టోబర్ నెల చివరి వరకు పరిస్థితి.

ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకి..

ఇక నవంబర్ నెలలోనూ తొలి 5 రోజుల్లో స్వల్పంగా బంగారం ధర పెరిగింది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ట్రంప్ గాడిలో పెడతారనే నమ్మకంతో ఇన్వెస్టర్లు అంతా డాలర్‌ వైపు మళ్లారు. దీంతో డాలర్ సహా బిట్‌కాయిన్, స్టాక్ మార్కెట్లు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ వంటివి ఆకర్షణీయంగా మారాయి. అటోమెటిక్‌గా బంగారం తన విలువను కోల్పోతుంది. డాలర్ 4 నెలల గరిష్ట స్థాయిల్ని దాటి ట్రేడవుతుండగా.. బంగారం ధర గరిష్టాల నుంచి వరుసగా పతనం అవుతోంది.

BSNL Recharge Plan : జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా..!

బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింతగా తగ్గుముఖం పట్టవచ్చని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా వేస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి తిరిగి ఈక్విటీలు, బాండ్‌ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. అందుకే గోల్డ్‌, సిల్వర్‌ మార్కెట్లలో ఈ కరెక్షన్‌ ఉందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. దీంతో మున్ముందు ధరల్లో మరింత దిద్దుబాటుకు అవకాశాలూ లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ఇదే నిజమైతే భవిష్యత్ రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గినా తగ్గవచ్చు.