Star Health Insurance : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.. భారత్‌లోనే తొలిసారిగా బ్రెయిలీలో బీమా పాలసీ..!
Star Health Insurance : అంతగా సేవలు అందుబాటులో ఉండని ఇలాంటి కస్టమర్లకు హెల్త్ కవరేజీకి సంబందించిన ప్రధాన అవసరాలను తీర్చే విధంగా ఈ పాలసీని ప్రవేశపెట్టింది.

Star Health Insurance Launches India's First Insurance Policy in Braille
Star Health Insurance : భారత్‌లో దిగ్గజ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రెయిలీలో బీమా పాలసీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిశ్రమలో ఇలాంటి బీమా పాలసీని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అయితే, దృష్టి లోపం ఉన్నవారు, అంధులు తమ ఆరోగ్యం, ఆర్థికాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
దేశంలోని 3.4 కోట్ల మంది దృష్టి లోపం, అంధత్వంతో బాధపడేవారు ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కూడా స్టార్ హెల్త్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివిటీ డ్రైవ్‌ను ఆవిష్కరించింది. సేవలు అంతగా అందని వర్గాలవారికి కంపెనీలో ఆరోగ్య బీమా ఏజంట్లుగా మారేందుకు కూడా అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ అందించనుంది. తమ ప్రాంతంలోనే ఉండి పనిచేస్తూ, బాధ్యతలను నిర్వర్తించుకునేలా వీలు కల్పిస్తుంది.
వైకల్యాలున్న వ్యక్తుల (పీడబ్ల్యూడీ) అవసరాలను తీర్చే విధంగా ‘స్పెషల్ కేర్ గోల్డ్’ పాలసీ ప్రత్యేకంగా రూపొందించింది. భారత్‌లో 3.4 కోట్ల మంది జనాభాలో 2.5 శాతం మంది దృష్టి లోపం కలిగి ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2017లో వెల్లడించింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్థాల్మాలజీ 2022లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దృష్టి లోపం కారణంగా రూ. 646 బిలియన్ల మేర ఆర్థిక నష్టం, రూ. 9,192 మేర తలసరి ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన హెల్త్‌కేర్ లక్ష్యం :
అంతగా సేవలు అందుబాటులో ఉండని ఇలాంటి కస్టమర్లకు హెల్త్ కవరేజీకి సంబందించిన ప్రధాన అవసరాలను తీర్చే విధంగా ఈ పాలసీని ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన హెల్త్‌కేర్ అందుబాటులో ఉండేలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషల్ కేర్ గోల్డ్ నిదర్శనంగా నిలుస్తుంది. స్పెషల్ కేర్ గోల్డ్ అనేది బ్రెయిలీలో అందించే బీమా పాలసీ మాత్రమే కాదు. సాధికారతకు, సమాన అవకాశాలను అందిస్తుంది. అందరికి ఆరోగ్యపరమైన రక్షణ పొందేందుకు సమాన హక్కులు ఉంటాయి.
కొత్త రిక్రూట్లకు పరీక్ష సన్నాహాల్లో తోడ్పాటు, ఆడియో శిక్షణ, వైకల్యం గల వ్యక్తులు (పీడబ్ల్యూడీ) పరీక్షలు రాసేందుకు స్క్రైబ్‌ను ఏర్పాటు చేయడం వంటి సహకారం అందించాలనేది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యం. సహాయ సహకారాలు, సమస్యలను పరిష్కరించేందుకు ఏజెంట్ల కోసం ప్రత్యేక హాట్‌లైన్ నంబరు ఏర్పాటు చేసింది. అట్టడుగు వర్గాలవారు తమ ఇంటి నుంచే తమ వెసులుబాటు ప్రకారం పనిచేస్తూ ఆదాయాన్ని పొందే వీలు కల్పించనుంది.
నేషనల్ అసౌసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ (ఎన్ఏబీ) సహకారంతో “స్పెషల్ కేర్ గోల్డ్” పాలసీ డాక్యుమెంటు బ్రెయిలీ వెర్షన్ రూపొందించింది. శారీరకంగా, ఇంద్రియపరంగా లేదా మేథోపరమైన లోపాలకు సంబంధించి 40శాతం లేదా అంతకు మించిన వైకల్యం ఉన్నవారికి తోడ్పడేలా ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది. ముఖ్యమైన వైద్య చికిత్సలు, సపోర్ట్ సేవలకు కూడా కవరేజీ అందిస్తుంది.