Stock Market Crash
Stock Market Crash : అమెరికా పరస్పర సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. 2008 తర్వాత భారీ స్థాయిలో ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
ప్రతి రంగానికి సంబంధించిన నిఫ్టీ ఇండెక్స్ రెడ్ కలర్‌లోకి మారిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బ్లడ్ బాత్ కనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. ఆరంభమైన 10 సెకన్లలోనే దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ50 శాతం పడిపోయాయి. సెన్సెక్స్ మాత్రం ఏకంగా 3వేల పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 22వేల మార్క్ కోల్పోయింది.
మరోవైపు.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో కూడా భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మొత్తం మీద, BSEలో జాబితా చేసిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.19.39 లక్షల కోట్లు తగ్గింది. అంటే.. మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారుల సంపద రూ.19.39 లక్షల కోట్లు ఆవిరి అయింది. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయి నష్టాలను చవిచూస్తున్నాయి.
ప్రస్తుతం బిఎస్‌ఇ సెన్సెక్స్ 3379.19 పాయింట్లు (4.48 శాతం) భారీ నష్టంతో 72633.63 వద్ద ఉంది. నిఫ్టీ 50 మాత్రం 1056.05 పాయింట్లు (4.61శాతం) నష్టంతో 21848.40 వద్ద ఉంది. అంతకుముందు రోజు (శుక్రవారం) బిఎస్‌ఇ సెన్సెక్స్ 930.67 పాయింట్లు లేదా 1.22శాతం తగ్గి 75364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 1.49శాతం లేదా 345.65 పాయింట్లు తగ్గి 22904.45 వద్ద ముగిసింది.
రూ.19.39 లక్షల కోట్లు ఆవిరి :
ఏప్రిల్ 4, 2025న BSEలో లిస్టు అయిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 4,03,34,886.46 కోట్లు. ఈరోజు అంటే.. ఏప్రిల్ 7న మార్కెట్ ప్రారంభమైన వెంటనే అది రూ.3,83,95,173.56 కోట్లకు చేరుకుంది. పెట్టుబడిదారుల మూలధనం రూ.19,39,712.9 కోట్ల మేరకు నష్టపోయింది.
ఏప్రిల్ 3న బిఎస్‌ఇలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,13,33,265.92 కోట్లు. సెన్సెక్స్‌లో కేవలం 1 వాటా మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉంది. సెన్సెక్స్‌లో 30 షేర్లు జాబితా అయ్యాయి. అందులో భారతి ఎయిర్‌టెల్ మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉంది. కానీ, పెరుగుదల ఒక శాతం కన్నా తక్కువగా ఉంది. మరోవైపు, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ అతిపెద్ద క్షీణతను చవిచూశాయి.
ఏడాదిలో గరిష్ట స్థాయికి 24 స్టాక్స్ :
ఈరోజు BSEలో 2289 షేర్లు ట్రేడవుతున్నాయి. ఇందులో, 1029 స్టాక్‌లు లాభాల్లో కనిపిస్తున్నాయి. అయితే, 1101 పతన దిశగా కనిపిస్తున్నాయి. 159లో ఎలాంటి మార్పు కనిపించలేదు. మరో24 షేర్లు ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి, 23 షేర్లు ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 103 షేర్లు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకోగా, 29 షేర్లు లోయర్ సర్క్యూట్‌కు చేరుకున్నాయి.