SmartPhone Tips : మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యే ముందు అలర్ట్ చేస్తుంది.. ఈ సింపుల్ సెట్టింగ్‌ ఇప్పుడే ఆన్ చేసి పెట్టుకోండి..!

SmartPhone Tips : మీ స్మార్ట్‌ఫోన్‌ డేటా భద్రమేనా? వెంటనే మీ ఫోన్ సెట్టింగ్‌ ఆన్ చేసుకోండి. మీ డేటా హ్యాక్ అవుతుందో లేదో ముందే తెలుసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ట్రై చేయండి.

SmartPhone Tips : మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యే ముందు అలర్ట్ చేస్తుంది.. ఈ సింపుల్ సెట్టింగ్‌ ఇప్పుడే ఆన్ చేసి పెట్టుకోండి..!

Smartphone Data From Scammers

Updated On : April 6, 2025 / 5:50 PM IST

SmartPhone Tips : మీ స్మార్ట్‌ఫోన్ డేంజర్‌లో ఉంది జాగ్రత్త.. మీ ఫోన్ ఎప్పుడైనా హ్యాక్ అవ్వొచ్చు. ప్రస్తుత రోజుల్లో హ్యాకర్లు ఫోన్లను ఏదో విధంగా హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. గుర్తుతెలియని లింకులతో పాటు అన్‌నౌన్ యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తుంటారు.

ఇలాంటి యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన స్మార్ట్‌‌ఫోన్‌లో ఎక్కువగా ప్రైవేట్ డేటా సేవ్ చేసి ఉంటుంది. వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే దుర్వినయోగం చేసే రిస్క్ ఉంది.

Read Also : Tata Biggest Sale : టాటా బిగ్గెస్ట్ సేల్.. ఈ మోడల్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు.. త్వరపడండి!

చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు తమ ఫోన్ హ్యాక్ అయిందనే అవగాహన ఉండదు. అసలు విషయం తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అనుకోని పరిస్థితుల్లో హ్యాకర్ల చేతికి మన ప్రైవేట్ డేటా చిక్కితే చాలా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అందుకే మన ప్రైవేట్ డేటా ప్రొటెక్ట్ చేసుకోవాలి.

ఇలాంటి హ్యాకింగ్ రిస్క్ నుంచి మీ స్మార్ట్ ఫోన్ తో పాటు ప్రైవేట్ డేటాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసా? మీరు చేయాల్సిందిల్లా.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక సెట్టింగ్‌ని ఆన్ చేసుకుంటే చాలు.. మీ డేటా హ్యాక్ అవుతుందో లేదో ఈ సెక్యూరిటీ ఫీచర్ అలర్ట్ చేస్తుంది. మీరు ముందుగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే.. మీకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తుంది.

ఆ ఆప్షన్ కిందికి స్క్రోల్ చేస్తే.. మీకు మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే.. ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

Read Also : Maruti e-Vitara : మారుతినా మజాకా.. ఫస్ట్ ఎలక్ట్రిక్ e-విటారా వచ్చేస్తోందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ రేంజ్.. 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా!

మీకు ‘Use Live Threat Detection’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు యూజ్ లైవ్ థ్రెట్ డిటెక్షన్ ముందు ఉన్న టోగుల్‌ని ఆన్ చేయాలి. మీరు దాన్ని ఆన్ చేసిన వెంటనే మీ డేటా హ్యాక్ అవుతుందని ఫోన్ స్వయంగా మీకు అలర్ట్ పంపుతుంది.