Tata Biggest Sale : టాటా బిగ్గెస్ట్ సేల్.. ఈ మోడల్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు.. త్వరపడండి!

Tata Biggest Sale : కొత్త కారు కోసం చూస్తున్నారా? టాటా మోటార్స్ వినియోగదారుల కోసం అతిపెద్ద సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్కో మోడల్ కారుపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

Tata Biggest Sale : టాటా బిగ్గెస్ట్ సేల్.. ఈ మోడల్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు.. త్వరపడండి!

Tata Biggest Sale Of 2025

Updated On : April 6, 2025 / 4:52 PM IST

Tata Biggest Sale : కొత్త కారు కొంటున్నారా? ఈ ఏప్రిల్‌లో టాటా బిగ్గెస్ట్ సేల్ 2025 ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా అనేక వేరియంట్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే, ఇప్పటికే టాటా ప్యాసింజర్ వాహనాలపై 3శాతం ధరల పెంపును ప్రకటించింది.

టాటా మోటార్స్ పంచ్, నెక్సాన్, కొత్తగా లాంచ్ అయిన కర్వ్ వంటి పాపులర్ కార్లపై మాత్రం ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు MY25 స్టాక్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు MY24 కార్లపై కూడా అధిక మొత్తంలో క్యాష్ బెనిఫిట్స్ ఎక్కువగా ఆఫర్ చేస్తోంది.

Read Also : PM Kisan 20th Installment : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది ఎప్పుడో తెలిసిందోచ్.. ఈ పని పూర్తి చేసిన రైతులకే డబ్బులు..!

టాటా ఆల్ట్రోజ్ (అన్ని ఫ్యూయిల్ టైప్స్)పై అత్యధిక డిస్కౌంట్‌ను అందిస్తుంది. అత్యంత సరసమైన టాటా టియాగో నుంచి నెక్సాన్, కర్వ్, హరియర్, సఫారీ వరకు పాపులర్ టాటా కార్లపై అందుబాటులో ఉన్న వినియోగదారుల డిస్కౌంట్లను ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా ఏప్రిల్ 2025 డిస్కౌంట్లు
టాటా టియాగో :
MY25 స్టాక్ టాటా టియాగోపై రూ. 10వేల డైరెక్ట్ కన్స్యూమర్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌ను ప్రకటించింది. మొత్తంగా బెనిఫిట్స్ రూ. 25వేలు (XE మినహా అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది). MY24 స్టాక్ కోసం.. కంపెనీ రూ. 20వేల కన్స్యూమర్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇదే విధమైన ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్‌తో టాటా టియాగో అన్ని వేరియంట్‌లపై మొత్తం డిస్కౌంట్ రూ. 35వేల వరకు వస్తుంది.

టాటా టిగోర్ :
MY25 టాటా టిగోర్ రూ. 15వేల తగ్గింపుతో పాటు రూ. 15వేల అదనపు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్‌తో లభిస్తుంది. మొత్తం బెనిఫిట్స్ రూ. 30వేల వరకు ఉంటాయి. మరోవైపు, మీరు MY24 స్టాక్‌ను ఎంచుకుంటే.. వినియోగదారు డిస్కౌంట్ రూ. 30వేలకు రెట్టింపు అవుతుంది. కొనుగోలుదారులకు రూ. 45వేల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

టాటా ఆల్ట్రోస్ :
MY25 టాటా ఆల్ట్రోజ్ (పెట్రోల్, CNG, డీజిల్)పై వినియోగదారులకు రూ. 20వేల తగ్గింపు, రూ. 25వేల ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్, మొత్తం రూ. 45వేల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. MY24 టాటా ఆల్ట్రోజ్ (పెట్రోల్, CNG, డీజిల్) అన్ని ఇతర మోడళ్లపై ఆకర్షణీయమై డీల్ అందిస్తోంది.

కంపెనీ రూ. 50వేలు డైరెక్ట్ కన్స్యూమర్ డిస్కౌంట్, రూ. 50వేల ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్‌ను అందిస్తోంది. ఇందులో మొత్తం రూ. లక్ష వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. MY24 టాటా ఆల్ట్రోజ్ రేసర్ (పెట్రోల్) పై రూ. 85వేలు హైయర్ కన్స్యూమర్ డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం బెనిఫిట్స్ రూ. 1,35,000కు పెరుగుతాయి.

టాటా పంచ్ :
టాటా పంచ్ MY25 (ఎక్స్ ప్యూర్ వేరియంట్ మినహా)పై రూ. 10వేల కన్స్యూమర్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ తక్కువగా ఉంటుంది. అందులో రూ. 15వేలు నుంచి బెనిఫిట్స్ రూ. 25వేల వరకు ఉండవచ్చు. MY24 టాటా పంచ్ కూడా ఇలాంటి డిస్కౌంట్‌నే అందిస్తోంది. కానీ, కంపెనీ రూ. 25వేల వరకు కన్స్యూమర్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

టాటా నెక్సన్ :
MY25 టాటా నెక్సాన్‌పై ఎలాంటి డైరెక్ట్ కన్స్యూమర్ డిస్కౌంట్ లభించదు. కొనుగోలుదారులు రూ. 15వేలు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్‌ను మాత్రమే పొందవచ్చు. MY24 టాటా నెక్సాన్‌పై రూ. 35వేలు అడ్వాన్స్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 10వేలు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్‌తో కలిపి అన్ని రకాల మోడళ్లపై మొత్తం డిస్కౌంట్ రూ. 45వేల వరకు పొందవచ్చు.

టాటా కర్వ్ :
MY25 టాటా కర్వ్ ICEపై ఎలాంటి తగ్గింపు ఉండదని కొనుగోలుదారులు గమనించాలి. MY24 టాటా కర్వ్ ICEపై రూ. 30వేల డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుంది. కానీ, ఎలాంటి ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ లేదు.

టాటా హారియర్ :
MY25 టాటా హారియర్‌పై రూ. 25వేలు డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 25వేలు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. మొత్తం ప్రయోజనాలను రూ. 50వేల వరకు పెంచవచ్చు. MY24 టాటా హారియర్‌పై రూ. 50వేలు మరింత డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తంగా ఈ మోడల్ కారుపై రూ. 75వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Honda CB350 Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా సరికొత్త బైక్ ఇదిగో.. 3 కలర్ ఆప్షన్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

టాటా సఫారి :
MY25 టాటా సఫారీ రూ. 50వేల బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 25వేల కన్స్యూమర్ డిస్కౌంట్, రూ. 25వేల ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్‌తో సహా అందిస్తుంది. మరిన్ని డిస్కౌంట్లను పొందాలంటే MY24 వేరియంట్‌లను ఎంచుకోవచ్చు. వినియోగదారులకు డిస్కౌంట్ రూ. 50వేలకు పెరుగుతుంది.

దాంతో మొత్తంగా రూ. 75వేల బెనిఫిట్స్ పొందవచ్చు. అడ్వాన్స్ డిస్కౌంట్లతో పాటు టాటా మోటార్స్ లిమిటెడ్ పీరియడ్ MY24 ప్లాంట్ స్టాక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ద్వారా ఆల్ట్రోజ్‌పై రూ. 1.5 లక్షలు, హారియర్‌పై రూ. 1 లక్ష, సఫారీపై రూ. 1 లక్ష, టిగోర్‌పై రూ. 60వేలు, నెక్సాన్‌పై రూ. 50వేలు, పంచ్‌పై రూ. 50వేలు, కర్వ్‌పై రూ. 40వేలు, టియాగోపై రూ. 25వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.