Maruti e-Vitara : మారుతినా మజాకా.. ఫస్ట్ ఎలక్ట్రిక్ e-విటారా వచ్చేస్తోందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ రేంజ్.. 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా!
Maruti e-Vitara : మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. 500కిలోమీటర్ల రేంజ్‌తో 7 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ సహా మరెన్నో ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?

Maruti’s first EV e-Vitara
Maruti e-Vitara Launch : కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫస్ట్ ఫుల్-ఎలక్ట్రిక్ SUV e-Vitara వచ్చేస్తోంది. ఏప్రిల్ 2025 నెలాఖరులో భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఈ ఎలక్ట్రిక్ SUV కారును ఇటీవల ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ ప్రదర్శించింది. మారుతి సుజుకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ వాహనం కంపెనీ హార్టెక్ట్ ఇ-ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. అనేక అడ్వాన్స్ టెక్నాలజీలతో పాటు సేఫ్టీ లక్షణాలతో వస్తుంది. పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్, లాంగ్ రేంజ్ కారణంగా భారతీయ కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
పవర్‌ఫుల్ బ్యాటరీ, రేంజ్ ఎంతంటే? :
మారుతి ఇ-విటారా 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 141Bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇ-విటారా 171Bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ రెండు బ్యాటరీ వేరియంట్లు 189Nm పీక్ టార్క్‌ను అందిస్తాయి.
ఇంటీరియర్ డిజైన్, కంఫర్ట్ :
ఈ కారు లోపలి భాగం కూడా ఆకట్టుకునేలా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 4 డ్యూయల్-టోన్ ఇంటీరియర్ ఆప్షన్లను అందిస్తుంది. క్యాబిన్‌కు మరింత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అదనపు లగేజ్ స్థలం కోసం ఫోల్డబుల్ స్ప్లిట్-ఫోల్డింగ్ సీట్లను కలిగి ఉంటుంది. అదనంగా, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో డ్యూయల్-స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
ఇ-విటారా సేఫ్టీ, అడ్వాన్స్ ఫీచర్లు :
ఈ ఎలక్ట్రిక్ SUV అడాస్ లెవల్ 2 టెక్నాలజీతో అమర్చి ఉంది. చాలా సేఫ్టీగా మరింత అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. ఆటోమాటిక్‌గా స్పీడ్ కంట్రోల్ చేస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ కారు సరైన లేన్‌లో ఉండేలా చేస్తుంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. కారు 7 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ ఫీచర్ ఇదే ఉంటుంది.
వేరియంట్లు, ధర :
మారుతి ఇ-విటారా కారు డెల్టా, జీటా, ఆల్ఫా అనే 3 వేర్వేరు వేరియంట్లలో విడుదల కానుంది. అందులో ఈ ఎలక్ట్రిక్ SUV అంచనా ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు.