Salary Tips : మీ జీతం రాగానే అయిపోతుందా? ఫస్ట్ ఈ 5 అలవాట్లను మార్చుకోండి.. ఇక జన్మలో అప్పులపాలవ్వరు!
Salary Tips : నెల జీతం అందుకున్న కొద్ది రోజులకే జేబులు పూర్తిగా ఖాళీ అయిపోవడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. నెల చివరి వారానికి వచ్చేసరికి వారి ఖర్చులకు కూడా సరిపడా డబ్బు చేతిలో ఉండదు.. ఏం చేయాలంటే?
Salary Tips ( Image Credit : AI )
Salary Tips : చేతిలో డబ్బు ఉంటే చాలు.. తెగ ఖర్చు పెట్టేస్తుంటారు. చాలామంది నెల జీతం వచ్చిన వెంటనే సేవింగ్ కన్నా ఖర్చుల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రతి మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి నెలా ఇదే జరుగుతుంది. జీతం ఇలా అకౌంటులో క్రెడిట్ కాగానే అలా ఖర్చు చేయడం కొద్ది రోజులకే జేబులు పూర్తిగా ఖాళీ అయిపోవడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్యగా మారింది.
నెలాఖరుకు వచ్చేసరికి మీ ఖర్చులకు కూడా సరిపడా డబ్బు మిగలదు. చిన్న చిన్న ఖర్చులు కూడా కష్టంగా అనిపించవచ్చు. అయితే, కొన్ని చిన్న అలవాట్లను మార్చుకుంటే మీరు డబ్బు ఆదా చేయడమే కాదు.. నెల మొత్తం ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా మీ ఖర్చులను పెట్టుకోవచ్చు. మనీ సేవింగ్స్ టిప్స్ ఎలా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. లగ్జరీ కోసం ఆశ పడొద్దు.. ద్రవ్యోల్బణంతో జాగ్రత్త :
ఆదాయంలో స్వల్ప పెరుగుదల రాగానే చాలామంది వెంటనే కొత్త ఫోన్, ఖరీదైన కారు కొనడం లేదా లగ్జరీ లైఫ్ స్టయిల్ అలవాటు చేసుకుంటారు. నెలవారీ ఖర్చులను కూడా భారీగా పెంచుకుంటారు. ఈ అలవాటు చాలా డేంజర్.. మీ ఆదాయం పెరిగేకొద్దీ, మీరు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖర్చు కన్నా పెట్టుబడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.
2. పర్సనల్ లోన్ తీసుకోవద్దు :
పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా ఈజీ. కానీ, కొన్నిసార్లు చాలా ఖరీదైనదిగా మారుతుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. లాంగ్ టైమ్ ఈఎంఐలు భారంగా మారవచ్చు. చిన్న అవసరాల కోసం రుణాలు తీసుకుంటే ఇబ్బందుల్లో పడపోతారు. అంతేకాదు.. మీ నెలవారీ బడ్జెట్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అందుకే, అత్యవసరం అయితే తప్ప మీరు పర్సనల్ లోన్ జోలికి వెళ్లొద్దు. ఇతర అనేక మార్గాల్లో డబ్బు కోసం ట్రై చేయొచ్చు.
3. మీ ఆదాయానికి అనుగుణంగా లోన్ తీసుకోండి :
రుణం తీసుకునేటప్పుడు మీ ఆదాయాన్ని కచ్చితంగా అంచనా వేయడం చాలా ముఖ్యం. మీ ఈఎంఐ మీ మొత్తం ఆదాయంలో 25 శాతం నుంచి 30 శాతం లోపు ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
తద్వారా ఇతర అవసరమైన ఖర్చుల కోసం డబ్బు చేతిలో ఉంటుంది. ఈ పరిమితికి మించి లోన్ తీసుకోవడం మీ నెలవారీ బడ్జెట్‌కు ఎఫెక్ట్ అవుతుంది. అందుకే లోన్ తీసుకునే ముందు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.
4. ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి :
జీవితంలో ఎలాంటి ఆపదలైనా రావచ్చు. అత్యవసర సమయాల్లో మీ సేవింగ్స్ మీకు అండగా నిలుస్తాయి. అందుకే ఆర్థిక సలహాదారులు ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర పెట్టుకోండని చెబుతుంటారు. అప్పుడు ఏదైనా అనుకోనిది జరిగినా కూడా మీరు మీ నెలవారీ ఖర్చులను ఈజీగా అధిగమించగలరు.
5. క్రెడిట్ కార్డులను స్మార్ట్‌గా వాడండి :
చాలా మంది క్రెడిట్ కార్డులను ఫ్రీగా డబ్బుగా వాడుకోవచ్చు అనుకుని చివరికి భారీమూల్యం చెల్లించుకుంటారు. అధిక వడ్డీ రేట్లు మీ నెలవారీ బడ్జెట్‌ను నాశనం చేస్తాయి. అందుకే క్రెడిట్ కార్డులను చాలా తెలివిగా వాడుకోవాలి. మీ కార్డు లిమిట్ నుంచి 30 శాతం నుంచి లేదా 40 శాతానికి మించి ఖర్చు చేయొద్దు.. లేదంటే అప్పుల ఊబిలోకి వెళ్లిపోతారు జాగ్రత్త.
