ఇదే లాస్ట్ చాన్స్ : ఆర్బీఐకి సుప్రీం వార్నింగ్ 

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఇదే లాస్ట్ చాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

  • Publish Date - April 26, 2019 / 09:07 AM IST

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఇదే లాస్ట్ చాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఇదే లాస్ట్ చాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం (RTI) కింద బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలు, రుణ ఎగవేతదారుల జాబితాకు సంబంధించిన నివేదికలను బహిర్గతం చేయాల్సిందిగా ఆర్బీఐని సుప్రీం ఆదేశించింది.

ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్, గిరీష్ మిట్టల్ సుప్రీంలో ఆర్బీఐపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్బీఐ.. వార్షిక తనిఖీ నివేదికను రిలీజ్ చేయకపోవడంపై ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. 

ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎంఆర్ షా తో కూడిన ధర్మాసనం.. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికను విడుదల చేయాల్సిందిగా ఆర్బీఐని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.  

2015 కోర్టు ఆదేశాలకు అనుగుణంగా డిస్ క్లోజర్ పాలసీ విత్ డ్రా చేసుకుని.. RTI కింద బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను బహిర్గతం చేయాలని, చివరిసారి అవకాశం ఇస్తున్నట్టు సుప్రీం పేర్కొంది.