Suzuki e-Access Scooter (Image Credit To Original Source)
Suzuki e-Access : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని అనుకుంటున్నారా? మీకోసం భారతీయ మార్కెట్లోకి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఇ-యాక్సెస్’ వచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.88 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది.
ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ ఏథర్ రిజ్టా వంటి స్కూటర్‌లతో పోటీగా మార్కెట్లోకి విడుదల చేసింది. మహిళలు, ఆఫీసులకు వెళ్లేవారికి ఈవీ స్కూటర్ అద్భుతంగా ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. అండర్‌బోన్ ఫ్రేమ్ ఆధారంగా, సుజుకి ఇ-యాక్సెస్ 3.07 కిలోవాట్-అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 95 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ పవర్ 4.1 కిలోవాట్-అవర్ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా పొందుతుంది. 15Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
పూర్తిగా డిశ్చార్జ్ బ్యాటరీ అయినా పోర్టబుల్ ఛార్జర్ 4 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే, ఫాస్ట్ ఛార్జర్ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 2 గంటల 12 నిమిషాలు పడుతుంది.
Suzuki e-Access Scooter (Image Credit To Original Source)
సుజుకి ఇ-యాక్సెస్ స్కూటర్ :
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. 3 రైడింగ్ మోడ్‌లను (ఎకో, రైడ్ A, రైడ్ B), రీజెనరేటివ్ బ్రేకింగ్ రివర్స్ మోడ్‌ను కూడా అందిస్తుంది. బ్లూటూత్, యాప్ కనెక్టివిటీ USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LED లైటింగ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో మోడ్రాన్ లుక్ ఉంటుంది. కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. మెటాలిక్ మాట్టే స్టెల్లార్ బ్లూ మెటాలిక్ మాట్టే ఫైబ్రోయిన్ గ్రే ఉన్నాయి.
అంతేకాదు.. సుజుకి ఇ-యాక్సెస్ లైనప్ ఇప్పుడు 4 కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ఇతర ఆప్షన్లలో మెటాలిక్ మాట్టే బ్లాక్ నం. 2, మెటాలిక్ మాట్టే బోర్డియక్స్ రెడ్, పెర్ల్ గ్రేస్ వైట్ మెటాలిక్ మాట్టే ఫైబ్రోయిన్ గ్రే, పెర్ల్ జాడే గ్రీన్ మెటాలిక్ మాట్టే ఫైబ్రోయిన్ గ్రే ఉన్నాయి.
ఈ సందర్భంగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమేడా మాట్లాడుతూ.. “సుజుకి ఇ-యాక్సెస్ అనేది సుజుకి ఫస్ట్ వరల్డ్ స్ట్రాజిక్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్. లాంగ్ టైమ్ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన హ్యాండ్లింగ్, స్మూత్ యాక్సిలరేషన్, క్వాలిటీ ఫిట్ ఫినిషింగ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వారి ప్రయాణంలో ఎల్లప్పుడూ మా కస్టమర్‌లకు సపోర్టు అందిస్తాం” అని అన్నారు.