Swarna Mudra sweet : దీపావళికి స్వర్ణ ముద్ర స్వీట్లు…కిలో ధర తెలిస్తే షాకవుతారు

దీపావళికి వివిధ కొత్త రకాల మిఠాయిలు మార్కెట్‌‌లోకి వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పొరతో తయారు చేసిన స్వర్ణ ముద్ర స్వీటుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.....

Swarna Mudra sweet : దీపావళికి వివిధ కొత్త రకాల మిఠాయిలు మార్కెట్‌‌లోకి వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పొరతో తయారు చేసిన స్వర్ణ ముద్ర స్వీటుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. దీపావళికి ముందు అహ్మదాబాద్‌లో స్వర్ణ ముద్ర అనే స్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారు పొరతో తయారు చేసిన ఈ మిఠాయి కిలో ధర 21వేల రూపాయలు. బంగారు పూత స్వీటు ఒక ముక్క 1400రూపాయలు పలుకుతోంది.

Also Read :  Newest Covid variant : మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి…శాస్త్రవేత్తల ఆందోళన

ఒక కిలో స్వర్ణ ముద్ర స్వీటులో 15 ముక్కలు ఉన్నాయి. ఈ స్వీటులో బాదం, బ్లూబెర్రీ, పిస్తా, క్రాన్ బెర్రీ వంటి పలు రకాల పదార్థాలను కలిపి తయారు చేశారు. ఈ అరుదైన స్వీట్లు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పరిధిలోని గ్వాలియా ఎస్‌బీఆర్ అవుట్ లెట్ లో విక్రయిస్తున్నారు. స్వర్ణ ముద్రా స్వీట్లను ఈ ఏడాది ప్రత్యేకంగా తయారు చేశామని, వీటికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని స్వీట్ హౌస్ యజమాని రవీనా తిల్వానీ చెప్పారు.

Also Read : Earthquake : పంజాబ్,కాశ్మీరుల్లో మళ్లీ భూకంపం, వరుస భూప్రకంపనలతో వణుకుతున్న జనం

ఈ బంగారు పూత స్వీట్లకు ఆర్డర్లు తీసుకుని తదనుగుణంగా సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వర్ణ ముద్రా స్వీట్స్‌తో పాటు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్‌కు సంబంధించి కిలో ధర రూ.350 నుంచి రూ.15,000 వరకు ఉన్నాయి. ఈ స్వీట్లకు పలు ఆర్డర్లు వస్తున్నట్లు ఆమె తెలిపారు. స్వీట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే వారందరి దృష్టిని స్వర్ణ ముద్రా స్వీట్స్ ఆకర్షిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు