Tata Altroz iCNG Bookings : ట్విన్ CNG సిలిండర్లతో ఇండియా ఫస్ట్ టాటా ఆల్ట్రోజ్ మోడల్.. రూ.21వేలకే బుకింగ్..!

Tata Altroz iCNG Bookings : టాటా మోటార్స్ నుంచి సరికొత్త టెక్నాలజీతో భారత మార్కెట్లో మొట్టమొదటి టాటా ఆల్ట్రోజ్ ట్విన్ CNG సిలిండర్ టెక్నాలజీతో వస్తోంది. ఇప్పుడే రూ.21వేలకు బుకింగ్ చేసుకోండి.

Tata Altroz CNG bookings open now, to be offered with twin CNG cylinders

Tata Altroz iCNG Bookings : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, టాటా ఆల్ట్రోజ్ iCNG వెర్షన్లపై బుకింగ్స్ ప్రారంభించింది. ఈ CNG వెర్షన్ మోడల్‌ను కేవలం రూ. 21,000 టోకెన్ మొత్తానికి బుకింగ్‌ చేసుకోవచ్చు. ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ iCNG వెర్షన్.. ట్విన్ CNG సిలిండర్‌లతో వచ్చిన భారత మొదటి CNG కారుగా చెప్పవచ్చు.

స్వదేశీ ఆటో మేజర్, ప్యాసింజర్ వాహనాల్లో ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో భారత మొట్టమొదటి ఒరిజినల్ డివైజ్‌ల తయారీదారు (OEM) కీలక పాత్ర పోషించింది. ఆల్ట్రోజ్ iCNG డెలివరీలు మే 2023లో ప్రారంభం కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ రేంజ్‌లో ఇప్పుడు పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, CNG పవర్‌ట్రెయిన్‌లు ఉన్నాయి.

Read Also :  5G Phones Launch : ఈ ఏడాది మేలో రానున్న 5G ఫోన్లు ఇవే.. ఏయే బ్రాండ్ మోడల్స్ ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

టాటా ఆల్ట్రోజ్ iCNG వెర్షన్ విషయానికి వస్తే.. CNG సిలిండర్‌లు, ఒక్కొక్కటి 30 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. లగేజీ పెట్టే కిందిభాగంలో ఉంటాయి. బూట్ స్పేస్‌ కలిగి ఉంటుంది. ఈ కారు పెట్రోల్ నుంచి CNG మోడ్‌కి మారుతుంది. తద్వారా కుదుపు లేని డ్రైవింగ్ అనుభవం పొందవచ్చు. ఒకే అధునాతన ECUని కలిగి ఉంది.

Tata Altroz iCNG Bookings open now, to be offered with twin CNG cylinders

పెట్రోల్ మోడ్‌కు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా CNG మోడ్‌లో స్టార్ట్ చేయొచ్చు. Altroz ​​iCNG థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, గ్యాస్ లీక్ డిటెక్షన్ ఫీచర్, రీఫ్యూయలింగ్ సమయంలో కారు స్విచ్ ఆఫ్ అయిందని తెలియాలంటే మైక్రో స్విచ్ వంటి అదనపు సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది.

మూడు ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో వస్తుంది. టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ iCNGని XE, XM+, XZ, XZ+ అనే నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. ఇందులో ఓపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ వంటి అనేక కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, లెథెరెట్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, IRA కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Read Also : BMW X3 M40i xDrive : బీఎండబ్ల్యూ X3 M40i SUV కారు వచ్చేస్తోంది.. కేవలం రూ.5 లక్షలకే బుకింగ్ చేసుకోండి..!