5G Phones Launch : ఈ ఏడాది మేలో రానున్న 5G ఫోన్లు ఇవే.. ఏయే బ్రాండ్ మోడల్స్ ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!
5G Phones Launch : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోడల్ ఫోన్లు (New Smartphones) లాంచ్ కానున్నాయి. ఇందులో ఏయే బ్రాండ్ మోడల్స్ ఉండొచ్చుంటే?

5G Phones Launch _ These 5G phones could launch in May 2023, Check Full Details
5G Phones Launch : 2023 ఏడాది మేలో భారత మార్కెట్లోకి కొత్త 5G స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్ కోసం ప్లాన్ చేస్తుంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. అద్భుతమైన ఫీచర్లతో 5G ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme 11 Pro) సిరీస్ ఈ ఏడాది మేలో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. మే 10న వార్షిక I/O డెవలపర్ కాన్ఫరెన్స్ని హోస్ట్ చేసేందుకు (Google) సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో Pixel Fold, Pixel 7a ఫోన్ల లాంచ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది మేలో రానున్న 5G ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఏప్రిల్ ఇంకా ముగియలేదు. వచ్చే మేలో 5G ఫోన్ లాంచ్ జాబితా ఇప్పటికే వెల్లడైంది. అందులో Realme 11 Pro సిరీస్ మేలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. లీక్ డేటా ఆధారంగా పరిశీలిస్తే.. వచ్చే నెల చివరి నాటికి OnePlus Nord 3 లాంచ్ చేయొచ్చు.
రియల్‌మి 11 Pro, రియల్‌మి 11 Pro+ :
Realme 11 Pro, Realme 11 Pro+ ఈ ఏడాది మేలో లాంచ్ కానున్నాయని కంపెనీ ధృవీకరించింది. కొత్త మిడ్-రేంజ్ ఫోన్లు కొత్త మీడియాటెక్ డైమెసిటీ 7000 చిప్సెట్తో రానున్నాయి. రియల్‌మి Realme 11 Pro+ మోడల్ బ్యాక్ 200-MP ప్రైమరీ సెన్సార్‌ను చూడవచ్చు.

5G Phones Launch _ These 5G phones could launch in May 2023, Check Full Details
ఈ హ్యాండ్సెట్ 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 16-MP ఫ్రంట్ కెమెరా, 80W లేదా 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌తో 5,000mAh బ్యాటరీని అందించనుంది. రియల్‌మి 11 ప్రో వెర్షన్ మరో కెమెరాను అందించవచ్చు. వెనుక ప్యానెల్ వద్ద 108-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. హుడ్ కింద, 67W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందించవచ్చు.
Read Also : Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!
పిక్సెల్ 7a :
మే 10న (Google I/O) ఈవెంట్లో Pixel 7a ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. లీక్‌ల ప్రకారం.. మిడ్-రేంజ్ ఫోన్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్‌పై పెద్ద అప్‌గ్రేడ్ కావచ్చు. Pixel 7a కొంచెం పెద్ద బ్యాటరీతో రానుంది. 90Hz డిస్ప్లే, గూగుల్ కొత్త ఫ్లాగ్షిప్ చిప్సెట్, బ్యాక్ కెమెరా సెటప్‌తో రావొచ్చు. కానీ, కొత్త వెర్షన్ ధర కూడా పాతదాని కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కనీసం భారత మార్కెట్లో గూగుల్ సరసమైన ఫోన్లను అదే పాత ధరలకే అందిస్తోంది. Pixel 6aతో పోలిస్తే.. Pixel 7a ధరను 50 డాలర్లకు పెంచే అవకాశం లేకపోలేదు.

5G Phones Launch _ These 5G phones could launch in May 2023, Check Full Details
భారత మార్కెట్లో Pixel 6a ఫోన్ ధర రూ. 43,999తో వచ్చింది. అమెరికా మార్కెట్ కన్నా రూ. 7వేలు ఎక్కువ. గూగుల్ పిక్సెల్ (Google Pixel 7a)ని పాత ధరలకే అందించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే, ఫోన్ల మధ్య ధర చాలా తేడా ఉంటుంది. Pixel 6a ప్రస్తుతం భారత మార్కెట్లో (Flipkart) ద్వారా రూ. 28,999 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన కొద్ది నెలలకే Pixel A సిరీస్ ఫోన్ ధరలు భారీగా పడిపోయాయి. కానీ, తక్కువ ధరకు Pixel 7aని కొనుగోలు చేయాలంటే చాలా కాలం పాటు వేచి ఉండాల్సిందే.
పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ :
ఫోల్డబుల్ మార్కెట్ ఇప్పటికే కొన్ని బెస్ట్ ఆప్షన్లతో నిండి ఉంది. ఈ కేటగిరీలో కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టేందుకు గూగుల్ కూడా రెడీ అవుతోంది. సెర్చ్ దిగ్గజం మే 10న ప్రారంభం కానున్న Google I/O ఈవెంట్లో మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
లీకుల ప్రకారం.. పిక్సెల్ ఫోల్డ్ మడతపెట్టినప్పుడు 5.8-అంగుళాల డిస్ప్లే, విప్పినప్పుడు 7.6-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. Google ఫ్లాగ్షిప్ టెన్సర్ G2 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 1,700 డాలర్లు (సుమారు రూ. 1,39,830)తో రావచ్చు. మరో పోటీదారు శాంసంగ్ 1,800 డాలర్లు (దాదాపు రూ. 1,48,050) Samsung Galaxy Z Fold 4 వంటి ధరలపై ప్రభావం పడుతుందని అంచనా.
వన్‌ప్లస్ Nord 3 ఫోన్ :
OnePlus Nord 3 ఫోన్ మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో లాంచ్ కానుంది. ఈ మిడ్-రేంజ్ 5G ఫోన్.. వాస్తవానికి 2022లో రావాల్సి ఉంది. అయితే, కంపెనీ చిన్న అప్గ్రేడ్లతో Nord 2Tని ఆవిష్కరించాలని ఎంచుకుంది. ఇప్పుడు, Nord 2 వెర్షన్ ఈ ఏడాదిలో అద్భుతమైన స్పెసిఫికేషన్లతో వచ్చే అవకాశం ఉంది. హుడ్ కింద 4,500mAh లేదా 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ Nord 2T 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్కు సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

5G Phones Launch _ These 5G phones could launch in May 2023
కంపెనీ 100W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టు అందిస్తుంది. మిడ్-రేంజ్ ఫోన్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. FHD+ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. OnePlus Nord 3 వెనుక ట్రిపుల్ కెమెరాలను చూడవచ్చు. OISకి సపోర్టుతో హై-రిజల్యూషన్ వైడ్ యాంగిల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 4K వీడియోలను రికార్డ్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ ఇతర ఫీచర్ల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.
Read Also : Apple Jobs in India : భారత్‌లో లక్షకు పైగా ఆపిల్ ఉద్యోగాలు.. 72 శాతం మంది మహిళలే.. ఎందుకో తెలుసా?