Tata Curve EV
Tata Curve EV : కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, టాటా కంపెనీ నుంచి టాటా కర్వ్ ఈవీ కారు అతి తక్కువ ధరకే లభ్యం అవుతోంది. టాటా కంపెనీ తమ కస్టమర్లకు బిగ్ ఆఫర్ డిస్కౌంట్‌ను అందిస్తుంది.
ఈ ఆఫర్‌ను కంపెనీ 2024 మోడల్స్ టాటా కర్వ్ ఈవీపై మాత్రమే అందిస్తోంది. టాటా కర్వ్ డిస్కౌంట్ ధర దాదాపు రూ. 1.7 లక్షలు ఉంటుంది.
ఈ టాటా కర్వ్ ఈవీ కారు కొనాలని చూస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్. ఇంతకీ టాటా కర్వ్ ఈవీ కారు సరసమైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
టాటా కర్వ్ EV డిస్కౌంట్ :
టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ చార్టులలో మూడో స్థానంలో నిలిచింది. మే 2025కి, టాటా కర్వ్ ఈవీ రూ. 1.7 లక్షల తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు MY2024 మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది. రూ. 90వేల క్యాష్ డిస్కౌంట్లు, రూ. 30వేల ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ఆఫర్, రూ. 50వేల వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి.
కంపెనీ అనేక తగ్గింపులను అందిస్తుంది. ఈ కొత్త MY2025 కర్వ్ EV రూ. 80వేల వరకు తగ్గింపుతో లభిస్తుంది అయితే, డిస్కౌంట్ వర్తించే ముందు కర్వ్ EV ధర రూ. 18.49 లక్షల నుంచి రూ. 23.52 లక్షల మధ్య ఉంటుంది.
టాటా కర్వ్ EV బ్యాటరీ ప్యాక్ :
టాటా కర్వ్ అనేది సరికొత్త ఎలక్ట్రిక్ కారు. ఆకట్టుకునే 55kWh బ్యాటరీ సామర్థ్యంతో హై RPM వద్ద 165bhp పవర్, 215Nm టార్క్‌ను అమర్చింది. అత్యుత్తమ SUV మెటీరియల్ కారు, టాటా కంపెనీ పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో తయారైంది.
ఈ కారు పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 7.9 గంటలు పడుతుందని కంపెనీ చెబుతోంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత ఈ కారు 502 కి.మీ రేంజ్ అందిస్తుంది.
టాటా కర్వ్ EV సేఫ్టీ ఫీచర్లు :
టాటా కర్వ్ అన్ని ఈవీ బెస్ట్ కారు, డిజిటల్ డిస్‌ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, సౌకర్యవంతమైన సీట్లు, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లతో అన్ని సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది.
సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. కంపెనీ ABS లేదా EBD టెక్నాలజీతో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. కంపెనీ మాదిరిగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లెవల్ 3 అడాస్, క్రూయిజ్ కంట్రోల్‌తో అన్ని ఫీచర్లను అందిస్తుంది.
Read Also : కొత్త రూల్.. ఇకపై ఓలా, ఉబర్ డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు డబ్బులు చెల్లించాల్సిందే..!
టాటా కర్వ్ ఈవీ ధర :
ఈ కారు ధర విషయానికి వస్తే.. టాటా కర్వ్ ధర ఎక్స్-షోరూమ్ రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమై దాదాపు రూ. 22 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.