Tata Harrier EV
Tata Harrier EV : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ SUV కారు వచ్చేసింది.
అదే.. టాటా హారియర్ ఎలక్ట్రిక్ అవతార్ కారు.. ఇప్పటికే హారియర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా హారియర్ ఈవీ అవతార్‌ను రిలీజ్ చేసింది.
Read Also : Jio Cheapest Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. జియో చీపెస్ట్ ప్లాన్‌తో 336 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
ఈ ఎలక్ట్రిక్ SUV మోడల్ ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ అయింది. అయితే టాప్ మోడల్ ధర ఇంకా ప్రకటించలేదు. టాటా హారియర్ ఈవీ SUVలో ప్రత్యేకమైన ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పవర్‌ఫుల్ బ్యాటరీ, పర్ఫార్మెన్స్ :
హారియర్ ఈవీ కారు 75kWh, 65kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. డ్యూయల్, సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్లు కలిగి ఉంది. గరిష్టంగా 390bhp పవర్, 504Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 627 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ హారియర్ కేవలం గంటకు 6.3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
కలర్ ఆప్షన్లు ఇవే :
ఈ హారియర్ ఈవీ కారు కొనుగోలు చేసే కస్టమర్లు దేశవ్యాప్తంగా కంపెనీ డీలర్‌షిప్‌లను విజిట్ చేసి కారును ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఈ e-SUV మొత్తం 4 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
ఎంపవర్డ్ ఆక్సైడ్, నైనిటాల్ నాక్టర్న్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ హారియర్ స్టీల్త్ ఎడిషన్‌లో కూడా అందుబాటులో ఉంది.
డిజైన్, లుక్ :
టాటా హారియర్ ఈవీ కారు లుక్స్ పరంగా అద్భుతంగా ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన లుక్స్, LED హెడ్ లైట్ సెటప్ ICE వెర్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. హెడ్ లైట్ రెండు చివర్లలో ఇంటిగ్రేటెడ్ DRL ట్రెండింగ్ లైట్ బార్ యూనిట్ ఉంటుంది. డ్యూయల్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
ఇంటీరియర్ ఫీచర్లు :
టాటా హారియర్ ఈవీ కారు క్యాబిన్ లోపల ఫోర్-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, మల్టీ డ్రైవింగ్ మోడ్స్, వెంటిలేషన్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ సీట్లు, ఫ్రంట్ ప్యాసింజర్ సీటుకు బాస్ మోడ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అన్ని వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీని కలిగి ఉంది.
Read Also : Redmi A4 5G : ఆఫర్ అదిరింది.. అతి చౌకైన ధరకే రెడ్‌మి 5G ఫోన్ కొనేసుకోండి.. మీ బడ్జెట్ ధరలోనే..!
సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ కారు లో లెవల్ 2 అడాస్, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాన్స్‌పరంట్ బోనెట్ వ్యూతో 540-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా సహా మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.