Tata Motors PV Models _ Tata Punch, Nexon, Harrier, Safari, Tiago, Tigor, Altroz _ All models are now RDE, E20-compliant
Tata Motors PV Models : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ (PV) రేంజ్‌ను BS6 ఫేజ్ II ప్రమాణాలకు అప్‌డేట్ చేసింది. టాటా మోటార్స్ పీవీ కారు మోడళ్లలో పంచ్, నెక్సాన్, హారియర్, సఫారి, టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్‌లతో సహా మొత్తం ప్యాసింజర్ వెహికల్ (PV) శ్రేణిని కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసింది. ఈ కారు మోడల్‌లు ఇప్పుడు BS6 ఇంజిన్‌లను కలిగి ఉన్నాయి. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉండటమే కాకుండా E20 ఇంధనానికి రెడీగా ఉన్నాయి.
కంపెనీ PVలపై స్టాండర్డ్ వారంటీని రెండు ఏళ్లు/75,000కిమీల నుంచి 3 సంవత్సరాలు/1,00,000కిమీలకు పెంచింది. టాటా మోటార్స్ టియాగో, టిగోర్‌లకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)ని యాడ్ చేసింది. అయితే, ఆల్ట్రోజ్, పంచ్ లో-ఎండ్ డ్రైవబిలిటీని మెరుగుపరిచింది. ఈ రెండు మోడళ్లకు ప్రామాణికంగా ఐడిల్ స్టాప్-స్టార్ట్‌ను కూడా చేర్చింది.
అంతేకాకుండా, టాటా మోటార్స్ కంపెనీ Altroz, Nexon రెండింటికీ Revotorq డీజిల్ ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మెరుగైన పనితీరు కోసం Nexon మోడల్ రీట్యూన్ చేసిందని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ఇటీవలే 2023 హారియర్, 2023 సఫారీ కొనుగోలు కోసం ముందుగానే బుకింగ్‌లను ప్రారంభించింది.
Tata Motors PV Models : Tata Punch, Nexon, Harrier, Safari, Tiago, Tigor, Altroz
రెండు SUVలు ఇప్పుడు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ అలర్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ రియర్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్లతో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లను (ADAS) పొందాయి.
360-డిగ్రీ కెమెరా, 10.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఇతర ఫీచర్లు కూడా 2023 హారియర్, 2023 సఫారీకి యాడ్ చేసింది. హారియర్, సఫారీ రెండూ ఒకే 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తాయి. 170PS గరిష్ట శక్తితో పాటు 350Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ ATతో యాడ్ చేసేందుకు వీలుంది.