Tata Safari Harrier Bookings : కొత్త కారు కొంటున్నారా? టాటా సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. రూ.25వేలకే బుక్ చేసుకోండి..!

Tata Safari Harrier Bookings : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. టాటా మోటార్స్ కంపెనీ సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కార్లపై బుకింగ్స్ ప్రారంభించింది.

Tata Safari Harrier Bookings : కొత్త కారు కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ (Tata Safari Facelift), టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ (Tata Harrier Facelift) కార్ల కొనుగోలుపై బుకింగ్స్ ప్రారంభించింది. ఈ రెండు మోడల్ కార్లపై టోకెన్ మొత్తానికి రూ.25వేల ధరకే బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఆటోమేకర్ అధికారిక వెబ్‌సైట్ అధీకృత డీలర్‌షిప్‌లలో ఆసక్తిగల కస్టమర్లు బుకింగ్‌లు చేయవచ్చు. టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ అనే 4 వేరియంట్‌లలో అందిస్తోంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సైన్-కంట్రోల్ పవర్డ్ టెయిల్‌గేట్, 10.3-అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 13 JBL మోడ్‌లు, 19-అంగుళాల అల్లాయ్‌లతో కూడిన హర్మాన్ అడ్వాన్స్‌డ్ ఆడియోవర్ఎక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Tata Safari And Harrier Facelift Cars Bookings open

టాటా ఫేస్‌లిఫ్ట్ ప్రత్యేక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :

టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ కూడా స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, ఫియర్‌లెస్ అనే 4 వేరియంట్‌లను కలిగి ఉంది. ఇప్పుడు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో SUV ADAS, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, స్మార్ట్ ఇ-షిఫ్టర్, పాడిల్ షిఫ్టర్‌లు, డ్యూయల్-సోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లును కలిగి ఉంది. ఈ రెండు SUVs కూడా డార్క్ అవతార్‌లలో ప్రవేశపెట్టింది. SUV పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పు లేదు. 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్‌తో వచ్చాయి.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

మహీంద్రా స్కార్పియోకు పోటీగా.. :

గరిష్టంగా 170PS పవర్, 350Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లు ఉన్నాయి. SUV కార్లలో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే 3 డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటాయి. సాధారణ, రఫ్, వెట్ అనేక టెర్రైన్ రెస్పాన్స్ మోడ్‌లు కూడా ఉన్నాయి. టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్‌లను కలిగి ఉంటుంది. టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా స్కార్పియో-N, MG హెక్టర్‌లకు పోటీగా ఉంటుంది.

ఈరోజు నుంచి కొత్త హారియర్, సఫారీ బుకింగ్‌లను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉంది. కస్టమర్ల విలువైన ఫీడ్‌బ్యాక్‌తో మరింత మార్పులతో రూపుదిద్దాం. ఈ లెజెండ్‌లు కొత్త ఆధిపత్య శకానికి నాంది పలికాయి‘ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అన్నారు.

Tata Safari And Harrier Facelift Cars

సామర్థ్యం గల OMEGARCపై నిర్మించిన ఈ SUVలు అత్యుత్తమ డిజైన్, అధునాతన ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్స్, బలమైన పవర్‌ట్రెయిన్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. టాటా మోటార్స్ SUV కొత్త వేవ్‌లలో ఈ 2 ప్రొడక్టులు కస్టమర్‌ల సామర్థ్యాన్ని బ్రాండ్ ఆకాంక్షలను మాత్రమే సూచిస్తాయని విశ్వసిస్తున్నామని అన్నారాయన.

Read Also : Tech Tips in Telugu : మీ ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో మల్టీపుల్ లింక్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు