Tata iPhone Maker : టాటా ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఐఫోన్ల తయారీ, అసెంబ్లింగ్ అంతా భారత్‌లోనే.. ఇదిగో క్లారిటీ..!

Tata iphone Maker : ఆపిల్ ఐఫోన్ల తయారీ రంగంలోకి టాటా అడుగుపెట్టేసింది. దేశీయ, గ్లోబల్ మార్కెట్ల కోసం భారత్‌లో ఆపిల్ ఐఫోన్‌లను తయారు చేయడం, అసెంబ్లింగ్ చేయడానికి టాటా గ్రూప్ (Tata Group) రెడీగా ఉందని కేంద్ర టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు.

Tata iPhone Maker : ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ (Tata Group) ఆపిల్ ఐఫోన్‌ల తయారీ రంగంలోకి అడుగుపెట్టేసింది. భారత్‌లో విస్ట్రోన్ కార్యకలాపాలను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో ఆపిల్ ఐఫోన్‌లను తయారు చేయడంతో పాటు అసెంబ్లింగ్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Minister Rajeev Chandrasekhar) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ (X) వేదికగా ప్రకటించారు. కేవలం రెండున్నరేళ్లలోపే టాటా గ్రూప్ ఇప్పుడు భారత్ నుంచి దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం ఐఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించనుంది.

Read Also : BMW X4 M40i Launch : కొత్త కారు కావాలా భయ్యా.. అదిరే ఫీచర్లతో BMW X4 M40i వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని ఏడాదిగా విస్ట్రన్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే టాటా ఆపిల్ సరఫరాదారు విస్ట్రాన్ కార్ఫ్ కార్యకలాపాలను కొనుగోలు చేసింది. దాంతో భారత్‌లో ఐఫోన్ల తయారీకి మార్గం సుగమమైంది. విస్ట్రోన్ కార్యకలాపాలను సొంతం చేసుకున్న సందర్భంగా టాటా బృందానికి మంత్రి రాజీవ్ అభినందనలు తెలిపారు. విస్ట్రాన్ రిలీజ్ చేసిన పత్రికా ప్రకటనను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

విస్ట్రాన్ కంపెనీ బోర్డు సమావేశాన్ని నిర్వహించిన అనంతరం అనుబంధ సంస్థలైన SMS ఇన్ఫోకామ్ (సింగపూర్) (Pte.Ltd)కి ఆమోదం తెలిపిందని ప్రకటించింది. విస్ట్రన్ హాంగ్ కాంగ్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TEPL)తో విస్ట్రోన్ ఇన్ఫోకామ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం పరోక్ష వాటాను విక్రయించడానికి వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది. ఇరువురి పక్షాల మధ్య సంబంధిత ఒప్పందాలు, సంతకాలు పూర్తి అయిన తర్వాత అవసరమైన ఆమోదాలను పొందేందుకు ఒప్పందం కొనసాగుతుంది.

లావాదేవీ పూర్తయిన తర్వాత విస్ట్రాన్ వర్తించే నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ప్రకటనలు, ఫైలింగ్‌లను చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రకటనతో భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేస్తున్న మొదటి భారతీయ సంస్థగా టాటా గ్రూప్ అవతరించనుందని అధికారికంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘విజన్ పీఎల్ఐ స్కీమ్’ ఇప్పటికే భారత్‌ను స్మార్ట్‌ఫోన్ తయారీ, ఎగుమతులకు విశ్వసనీయ ప్రధాన కేంద్రంగా మార్చిందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మరోవైపు.. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఆపిల్ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటోంది.

భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల వృద్ధికి పూర్తిగా మద్దతుగా నిలుస్తుంది. భారత్ తమ విశ్వసనీయ తయారీ, ప్రతిభ భాగస్వామిగా మార్చాలనుకునే గ్లోబల్ ఎలక్ట్రానిక్ బ్రాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. భారత్ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ పవర్‌గా మార్చాలనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని సాకారం చేసినట్టు తెలిపారు. టాటా గ్రూప్‌కు ఒక మైలురాయిగా మాత్రమే కాకుండా, ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ పెరుగుతున్న నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

Read Also : mAadhaar Profile : ఈ ఆధార్ యాప్‌లో మీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

ట్రెండింగ్ వార్తలు