BMW X4 M40i Launch : కొత్త కారు కావాలా భయ్యా.. అదిరే ఫీచర్లతో BMW X4 M40i వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

BMW X4 M40i : కొత్త కారు కొంటున్నారా? బీఎండబ్ల్యూ X4 M40i కారు వచ్చేసింది. 0-100kmph నుంచి 4.9 సెకన్లలో వేగవంతం చేయగలదు. గరిష్టంగా 250kmph వేగాన్ని అందుకోగలదు.

BMW X4 M40i Launch : కొత్త కారు కావాలా భయ్యా.. అదిరే ఫీచర్లతో BMW X4 M40i వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

BMW X4 M40i launched in India at Rs 96.20 lakh, Check Full Details

BMW X4 M40i Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW India) ఇండియా దేశంలోనే మొట్టమొదటి (BMW X4 M40i) ని రూ. 96.20 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. పూర్తిగా బిల్ట్-అప్ (CBU)గా అందుబాటులో ఉంటుంది. ఈ వెహికల్ BMW ఆన్‌లైన్ షాప్‌లో ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు.  బీఎండబ్ల్యూ X4 M40i కారు మోడల్ 3.0-లీటర్ బీఎండబ్ల్యూ M ట్విన్‌పవర్ టర్బో ఇన్‌లైన్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది.

360hp గరిష్ట శక్తిని, 500Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. బీఎండబ్ల్యూ  xDriveతో 4 చక్రాలకు శక్తిని ఇస్తుంది. వాహనం కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100కి.మీ వేగంతో దూసుకుపోతుంది. గరిష్టంగా 250కి.మీ వేగాన్ని అందుకోగలదు. 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందిస్తుంది. ఈ బీఎండబ్ల్యూ కారు ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+ మోడ్‌లలో రన్ అవుతుంది.

కొత్త X4 M40i ప్రామాణిక M స్పోర్ట్ డిఫరెన్షియల్, అడాప్టివ్ M సస్పెన్షన్, వేరియబుల్ స్పోర్ట్ స్టీరింగ్, M స్పోర్ట్ బ్రేక్‌లతో వస్తుంది. బీఎండబ్ల్యూ  X4 M40i క్రోమ్ ఫ్రేమ్‌తో ముదురు బీఎండబ్ల్యూ M కిడ్నీ గ్రిల్, హై-గ్లోస్ బ్లాక్‌లో డబుల్ కిడ్నీ బార్‌లు, (M) లోగోను పొందుతుంది. స్లిమ్ అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

ఏయే (BMW X4 M40i Features) ఫీచర్లు ఉన్నాయంటే? :
విస్తరించిన ఫీచర్‌లతో M హై గ్లోస్ షాడో లైన్‌తో బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్ విండో గ్రాఫిక్స్, రూఫ్ రెయిల్స్, ఫ్రేమ్, బార్‌లు హై-గ్లోస్ బ్లాక్‌లో ఉంటాయి. వెనుక వైపు, X4 M40i బ్లాక్ క్రోమ్‌లో ఫ్రీ-ఫారమ్ టెయిల్‌పైప్ ట్రిమ్‌లను కలిగి ఉంది. స్టాండర్డ్ 20-అంగుళాల జెట్ బ్లాక్ M లైట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. M స్పోర్ట్ బ్రేక్‌లు రెడ్ హై గ్లోస్ బ్రేక్ కాలిపర్‌లతో అందుబాటులో ఉన్నాయి.

BMW X4 M40i launched in India at Rs 96.20 lakh, Check Full Details

BMW X4 M40i launched in India

క్యాబిన్ లోపల ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్‌లు, మెమరీ ఫంక్షన్‌తో ముందు భాగంలో ప్రీమియం స్పోర్ట్స్ సీట్లు ఉన్నాయి. M సీట్‌బెల్ట్‌లు కూడా ఉన్నాయి. బీఎండబ్ల్యూ X4 M40i 3D నావిగేషన్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బీఎండబ్ల్యూ హెచ్‌యూడీ తో సహా బీఎండబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్‌ని కలిగి ఉంది. బీఎండబ్ల్యూని సైన్ కంట్రోల్ ఫీచర్ అనేక ఫంక్షన్‌లను కంట్రోల్ చేయడానికి ముందుగా 6 హ్యాండ్ గెచర్లను గుర్తిస్తుంది. 16 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, సరౌండ్ వ్యూ కెమెరాతో పార్క్ అసిస్టెంట్ ప్లస్, 6 ఎంపిక చేసిన లైట్లతో పరిసర లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.

భారత్‌లో విలక్షణమైన బీఎండబ్ల్యూ X4 స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకమైన శైలిని కలిగిన వినియోగదారుల కోసం ఎంపిక చేసుకునే వాహనంగా మారిందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా అన్నారు. ఇప్పుడు, మొట్టమొదటిసారిగా బీఎండబ్ల్యూ X4 M40iని ప్రకటించడానికి సంతోషిస్తున్నామని ఆయన చెప్పారు. M పవర్డ్ వాహనాల అపారమైన విజయానికి, భారత్‌లో పెరుగుతున్న ప్రత్యేకమైన M ఎడిషన్‌లకు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమని తెలిపారు.

Read Also : Apple Scary Fast Event : ఈ నెల 30నే ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రో, ఐమ్యాక్ లాంచ్..!