TCL Mini LED TV : కొత్త స్మార్ట్‌టీవీ భలే ఉందిగా.. TCL మినీ LED TV ఆగయా.. థియేటర్ సౌండ్ ఎఫెక్ట్.. LG, శాంసంగ్ ధర కన్నా తక్కువే..!

TCL Mini LED TV : కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. TCL నుంచి అద్భుతమైన డిస్‌ప్లేతో TCL మినీ LED TV వచ్చేసింది.. ధర కూడా తక్కువే..

TCL Mini LED TV

TCL Mini LED TV : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ప్రముఖ బ్రాండ్ టీసీఎల్ (TCL) భారతీయ మార్కెట్లో టెలివిజన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. టీసీఎల్ నుంచి (TCL Mini LED TV) సరికొత్త స్మార్ట్‌టీవీ సిరీస్ వచ్చేసింది. C72K QD మినీ LED స్మార్ట్ టీవీ సిరీస్ పలు సైజుల్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీలు రూ. 84,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్నాయి.

ఈ టీసీఎల్ సిరీస్‌లో 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాలు, 98 అంగుళాలతో మొత్తం 4 డిస్‌ప్లే సైజులు ఉన్నాయి. ఈ డిస్‌ప్లే సైజులు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్‌లలో ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. టీసీఎల్ స్మార్ట్‌టీవీ ఫీచర్లు, ధర వివరాలేంటో ఓసారి చూద్దాం..

QD, మినీ LED టెక్నాలజీతో డిస్‌‌ప్లే :
టీసీఎల్ C72K సిరీస్ టీవీల్లో క్వాంటం డాట్ (QD) మినీ LED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌ ఉంటుంది. క్రిస్టల్-క్లియర్ విజువల్స్, వైబ్రెంట్ కలర్స్, అల్ట్రా-స్మూత్ మోషన్‌ను అందిస్తుంది. సినిమాలు, గేమింగ్ రెండింటికీ అనువైనవి. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+, HDR కూడా సపోర్టు ఇస్తుంది. అడ్వాన్స్ కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ లెవల్స్ కూడా కలిగి ఉంది.

ఒన్కియో, డాల్బీ అట్మోస్‌తో ప్రీమియం ఆడియో :
ఈ స్మార్ట్‌‌టీవీ Hi-Fi సౌండ్ క్వాలిటీతో పాటు కంపెనీ ఆడియో బ్రాండ్ ఓన్కియో(Onkyo)తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్, DTS వర్చువల్ (X)లకు సపోర్టుతో వస్తుంది. మీ ఇంట్లోనే సినిమా లాంటి ఆడియో సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : iPhone 17 Pro Launch : ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో వస్తోందోచ్.. న్యూ లుక్ అదిరిందిగా.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీ :
గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై రన్ అయ్యే ఈ C72K సిరీస్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 10వేల కన్నా ఎక్కువ యాప్‌లను యాక్సెస్ చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా వంటి పాపులర్ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఈజీ యాక్సస్ అందిస్తుంది. క్విక్ నావిగేషన్ కోసం రిమోట్‌లో స్పెషల్ బటన్‌ కూడా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లు :
ఈ TCL స్మార్ట్ టీవీ Wi-Fi, HDMI, బ్లూటూత్, USB పోర్ట్‌లతో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది. ఎక్స్‌ట్రనల్ డివైజ్‌లు, సౌండ్ సిస్టమ్‌లు, గేమ్ కన్సోల్‌లను ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. వాయిస్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌తో వినియోగదారులు టీసీఎల్ స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చు.

టీసీఎల్ C72K QD మినీ LED స్మార్ట్ టీవీ సిరీస్ రూ. 85వేల కన్నా తక్కువ ధరలో లభిస్తోంది. LG, Samsung పోటీదారులతో పోలిస్తే చాలా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన డిస్‌ప్లే టెక్నాలజీ, థియేటర్ సౌండ్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్‌లో ప్రీమియం వ్యూ కోరుకునే భారతీయ యూజర్లకు ఇదే టీవీ అని చెప్పొచ్చు.