Tecno Pova 6 Pro Launch : టెక్నో పోవా 6ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌‌లో ఈ నెల 29నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Tecno Pova 6 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో ఈ నెల 29న టెక్నో పోవా 6ప్రో 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Tecno Pova 6 Pro Launch : టెక్నో పోవా 6ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌‌లో ఈ నెల 29నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Tecno Pova 6 Pro confirmed to launch in India on March 29

Tecno Pova 6 Pro Launch : టెక్నో సరికొత్త పోవా 6 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 29న భారత మార్కెట్లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఎమ్‌డబ్ల్యూసీ 2024లో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన ఈ మిడ్-రేంజ్ ఫోన్ అద్భుతమైన 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. గేమర్‌లు, ఇతర యూజర్లను మరింత ఆకర్షించేలా ఉంది. ఈ ఫోన్ ధర రూ. 14,999 మధ్య ఉండవచ్చు. టెక్నో అమెజాన్ మినీటీవీలో రస్క్ మీడియా ప్లేగ్రౌండ్ సీజన్ 3తో భాగస్వామ్యం కలిగి ఉంది.

Read Also : iPhone 15 Pro : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఈ ఫోన్ ఆటోమాటిక్‌గా ఆకర్షించే డిజైన్‌ను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ మాదిరిగానే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంటుంది. వివిధ రకాల 9 లైటింగ్ మోడ్‌లను అందించే 210 మినీ ఎల్ఈడీ అధికారిక స్పెషిఫికేషన్లను కలిగి ఉంది. బ్యాక్ కెమెరా సిస్టమ్ 108ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వస్తుంది. అయితే, ఫ్రంట్ సైడ్ ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, స్మూత్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పొడవైన 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. రాబోయే టెక్నో పోవా 6 5జీ ఫీచర్ల గురించి పూర్తిగా పరిశీలిద్దాం.

టెక్నో పోవా 6 ప్రో 5జీ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో 5జీ ఫోన్ గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్లలో కొత్త టెక్నో స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 6080 ఎస్ఓసీ ఫీచర్ ఉంది. దీనితో పాటు 12జీబీ ర్యామ్‌తో పాటు వర్చువల్‌గా విస్తరించవచ్చు. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కూడా ఉంది. 6,000ఎంఎహెచ్ బ్యాటరీ ఆధారితంగా పనిచేస్తుంది. 70డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 10డబ్ల్యూ వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

టెక్నోపోవా 6 ప్రో 5జీ ఫోన్ మెటోరైట్ గ్రే, కామెట్ గ్రీన్ అనే 2 అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డైనమిక్-లైట్ మినీఎల్‌ఈడీని కలిగి ఉంది. తొమ్మిది విభిన్న లైటింగ్ మోడ్‌లను అందించే 210 మినీ ఎల్‌ఈడీలతో వస్తుంది. బ్యాక్ సైడ్ హై-రిజల్యూషన్ 108ఎంపీ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెల్ఫీ షూటర్ ఉంది. ఈ డివైజ్ 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే స్క్రోలింగ్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారంగా టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ హెచ్ఐఓఎస్‌లో రన్ అవుతుంది. ఈ ఫోన్ బాక్స్‌లో ఛార్జర్ కేబుల్, ఛార్జర్ ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే.. టెక్నో (MWC 2024)లో టెక్నో కేమన్ 30 ప్రీమియర్‌ను కూడా వెల్లడించింది. ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, హై-రిజల్యూషన్ 6.77-అంగుళాల డిస్‌ప్లే, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ సెన్సార్‌లు, యాక్షన్ డాట్ నోటిఫికేషన్ ఇండికేటర్‌ డిజైన్‌తో వస్తుంది.

Read Also : Apple iPhone 14 Plus : రూ.50వేల లోపు ధరకే ఐఫోన్ 14 ప్లస్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ పొందాలంటే?